https://oktelugu.com/

Elephant: వామ్మో ఏనుగా మాజాకా? ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు?

ఆకులు తినాలనుకున్న ఏనుగు చెట్టు దగ్గరకు వెళ్తే దాని కొమ్మలు, ఆకులు ఆకాశంలో ఉన్నట్టు కనిపించాయి. అయితేనేం? ఏనుగుకి బలం తక్కువ ఉంటుందా? మొదట ఓ కొమ్మను విరగ్గొడదామని ప్రయత్నించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 25, 2024 / 04:51 PM IST

    Elephant

    Follow us on

    Elephant: ఏనుగమ్మ ఏనుగు ఏం తెచ్చింది ఏనుగు అంటూ, ఏనుగు పెద్ద జంతువు, బలమైనది అంటూ ఏనుగు గురించి మాట్లాడుకుంటారు. కానీ కొన్ని సార్లు ఏనుగు పనులు చూస్తే కూడా భలే అనిపిస్తుంటుంది కదా. అయితే ఏనుగు బలమైనదే కాదు తెలివైన జంతువు కూడా. ఏనుగుకు మంచి స్నేహభావం కూడా ఉంటుందట. అయితే దానికి తిక్కరేగిందంటే మాత్రం అవతలి వాళ్లకు చుక్కలు చూపిం డం కామన్. ఇక దానికి ఆకలేసిందంటే.. ఎంత కష్టమైనా ఆహారాన్ని మాత్రం కచ్చితంగా సంపాదిస్తుంటుంది.

    అప్పుడప్పుడూ ఏనుగులు చెట్ల లేత చిగుళ్లు తినే వీడియోలు వస్తుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం ఒకటి చూద్దాం. అడవిలోని ఓ ఏనుగు లేత చిగుళ్ళు తినాల అనుకున్నట్టు ఉంది. చెట్టు చూస్తే ఎత్తుంది. ఏనుగుకి అందడంలేదు కదా ఏం చేయాలి అని ఆలోచించినట్టు ఉంది. లాభం లేదు అనుకొని ఆ ఏనుగు అమాంతం అంత పెద్దచెట్టునూ నేలకూల్చేసింది. ఇదిగో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

    ఆకులు తినాలనుకున్న ఏనుగు చెట్టు దగ్గరకు వెళ్తే దాని కొమ్మలు, ఆకులు ఆకాశంలో ఉన్నట్టు కనిపించాయి. అయితేనేం? ఏనుగుకి బలం తక్కువ ఉంటుందా? మొదట ఓ కొమ్మను విరగ్గొడదామని ప్రయత్నించింది. వర్కవుట్‌ అవలేదు పాపం.. ఇక లాభం లేదనుకొని దాని తొండానికి పని చెప్పేసింది. దెబ్బకు చెట్టును కూల్చి పడేసింది. మొత్తం మీద సాధించి మెల్లగా కూలిపడిన చెట్టు దగ్గరికి వెళ్లింది ఏనుగు. దానికి కావాల్సిన కొమ్మలను తొండంతో తెంచుకొని తినేసింది ఆ తెలివైన ఏనుగు.

    దక్షిణాఫ్రికాలోని మలమలగమే రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఈ ఘటనను కొందరు వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోను 3 లక్షల మందికి పైగా లైక్‌ చేసి కామెంట్లు పెట్టారు.‘వామ్మో అంత పెద్ద చెట్టును ఎంత సింపుల్ గా పడేసింది ఏనుగు. నిజమే ఏనుగుకు బలం ఎక్కువే. అయినా అంత పెద్ద చెట్టు పెరగాలంటే కొన్ని ఏళ్లు పడుతుంది ఆ మాత్రం తెలియదు ఏనుగుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే అడవి నాశనమైపోదా..అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయినా జేసీబీలకు పని లేకుండా ఇలాంటి ఒక ఏనుగును పెంచుకుంటే చాలు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.