https://oktelugu.com/

Raghavendra Rao : రజినీకాంత్ కి ఒకేసారి 5 స్క్రిప్ట్ లు చెప్పిన తెలుగు స్టార్ డైరెక్టర్… ఒక్కటి కూడా ఫైనల్ అవ్వలేదు…కారణం ఏంటంటే..?

అలాంటిది రజనీకాంత్ ఎందుకు ఆయన సినిమాలను వదులుకున్నాడు అనేది కూడా అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది.రాఘవేంద్ర రావు చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సైతం భారీ సక్సెస్ లను అందించాడు... ఇక మొత్తానికైతే తెలుగులో రజినీకాంత్ చేయాల్సిన కొన్ని సినిమాలు మిస్ అయిపోయాయనే చెప్పాలి

Written By:
  • NARESH
  • , Updated On : July 15, 2024 / 12:15 PM IST

    Rajinikanth New Movie

    Follow us on

    Raghavendra Rao : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రజనీకాంత్…ఈయన లాంటి నటుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూ వస్తున్నాడు. ఇక ఒకానొక సమయంలో రజినీకాంత్ తమిళ్ సినిమా ఇండస్ట్రీకి దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పేరు తీసుకొచ్చాడు. ఇక మొత్తానికైతే రజనీకాంత్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమాల వల్లే తమిళ్ ఇండస్ట్రీ ఒక రేంజ్ లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం 80 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నా కూడా ఆయన వరుస సినిమాలను చేస్తూ మంచి దూకుడు మీదున్నారనే చెప్పాలి. ఇక గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక దాంతో ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటుగా ‘వెట్టయాన్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలతో రజనీకాంత్ మరొకసారి భారీ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో భారీ కలెక్షన్లను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సీనియర్ హీరోగా గుర్తింపు పొందుతున్న రజనీకాంత్ యంగ్ హీరోలకు సైతం ఏమాత్రం తీసుపోకుండా తన సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే అప్పట్లో రజనీకాంత్ స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలని చాలా వరకు ఆసక్తిని చూపించాడు. ఇక అందులో భాగంగానే ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయిన కే రాఘవేంద్రరావు అతనికి ఒకేసారి ఐదు స్క్రిప్ట్ లను వినిపించారట. అయినప్పటికీ రజినీకాంత్ కి ఆ స్టోరీ లు నచ్చకపోవడంతో వాటిని రిజెక్ట్ చేశాడు. ఇక రజనీకాంత్ రాఘవేంద్ర రావు కాంబోలో ఒక కమర్షియల్ సినిమా వస్తుందని అందరూ ఊహించారు. అయినప్పటికీ ఆ సినిమా మాత్రం రాలేదు. ఇక మరో పక్క కె విశ్వనాథ్ డైరెక్షన్ లో రజనీకాంత్ స్నేహితుడు ఆయన కమలహాసన్ భారీ సక్సెస్ లను అందుకోవడం చూసిన రజినీకాంత్ ఎలాగైనా సరే ఇక్కడ స్ట్రైయిట్ తెలుగు సినిమా చేయాలని అనుకున్నాడు. అందువల్లే ఆయన రాఘవేంద్రరావుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ అది మాత్రం వర్కౌట్ అవ్వలేదు. మరి రజనీకాంత్ కి ఆ కథలు ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని పక్కన పెడితే స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్ర రావు తో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్కరి కల…

    అలాంటిది రజనీకాంత్ ఎందుకు ఆయన సినిమాలను వదులుకున్నాడు అనేది కూడా అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది.రాఘవేంద్ర రావు చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సైతం భారీ సక్సెస్ లను అందించాడు… ఇక మొత్తానికైతే తెలుగులో రజినీకాంత్ చేయాల్సిన కొన్ని సినిమాలు మిస్ అయిపోయాయనే చెప్పాలి. మరి ఇప్పటికైన ఆయన స్ట్రైయిట్ తెలుగు సినిమా ఏదైనా చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు కనుక తెలుగులో సినిమా చేసినట్లయితే ఆయన సినిమాలను తెలుగులో విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి తెలుగులో మరింత మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి అప్పుడే చేయని రజనీకాంత్ ఇప్పుడు తెలుగు సినిమా చేస్తాడు అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…