https://oktelugu.com/

Sai Pallavi : తెలుగు హీరోల్లో సాయి పల్లవి కి ఆ హీరో అంటే చాలా ఇష్టమట…ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

Sai Pallavi అలా అయితేనే చిరంజీవితో కలిసి డ్యాన్సులు వేసే అవకాశం వస్తుంది. కాబట్టి తను హీరోయిన్ పాత్రను మాత్రమే ఎంచుకోవాలని చూస్తున్నాను అంటూ ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక మొత్తానికైతే సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరి కంటే విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని ముందుకు సాగడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : July 15, 2024 / 12:10 PM IST

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి కి అలాంటి ఒక గొప్ప కీర్తి అయితే దక్కింది. నిజానికి ఈమె సెలెక్టెడ్ క్యారెక్టర్స్ ను చేసుకుంటూ తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఇక మిగతా హీరోయిన్స్ లాగా అందాల ఆరబోత చేయడం, చిన్న చిన్న డ్రస్సులు వేసుకోవడం, తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నా లేకపోయిన డబ్బుల కోసం సినిమాలు చేయడం అనేవి ఆమె డిక్షనరీలోనే లేదు.

    ఆమె సినిమా చేయాలంటే ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. అలాగే ముద్దు సీన్స్ గాని,రొమాన్స్ గాని, చిన్నచిన్న బట్టలు ధరించే పాత్రలను కానీ ఆమె చేయదు. ఆమె పాత్రకి ఇంపార్టెన్స్ ఉండి ఆమె పెట్టిన అన్ని కండిషన్స్ కు ఓకే అయితేనే ఆమె అప్పుడు సినిమా చేస్తుంది. అందువల్లే ఆమె వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోయారు. సినిమాలు ఎవరైనా చేస్తారు. కానీ ఒక క్యారెక్టర్ ను తనకోసమే రాసుకొని ఆ దర్శకుడు ఆ పాత్రలో ఆమె ని తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంత గొప్ప క్రేజ్ ను మాత్రం కొంతమందే సంపాదించుకుంటారు. అందులో సాయి పల్లవి ఒకరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న రామాయణం లో సీత పాత్రలో నటిస్తుంది. సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాతోనే ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసి యూత్ లో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. అయితే ఫిదా సినిమా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా సాయి పల్లవికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసింది.

    ఇక ఆ సినిమా తర్వాత చేసిన మరికొన్ని సినిమాలు కూడా సాయి పల్లవికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి పల్లవికి తెలుగులో ఫేవరెట్ హీరోలెవరో తెలుసుకునే విషయం మీద చర్చలైతే జరుగుతున్నాయి.నిజానికి సాయి పల్లవికి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అని ఆమె కొన్ని సందర్భాల్లో తెలియజేసింది. చిరంజీవిని చూసే తను డాన్స్ నేర్చుకుందని చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పింది. అలాగే తను చిరంజీవి పక్కన డాన్స్ చేస్తు అందరి చేత విజిల్స్ వేయించుకోవడం తనకు కోరికగా ఉందని ఆమె కొన్ని సందర్భాల్లో తెలియజేసింది. అందుకే చిరంజీవి చేసిన ‘భోళా శంకర్ ‘ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిన కూడా తను నటించలేదు. ఎందుకంటే చిరంజీవి పక్కన హీరోయిన్ గా మాత్రమే నటించాలని అనుకుంటుందట.

    అలా అయితేనే చిరంజీవితో కలిసి డ్యాన్సులు వేసే అవకాశం వస్తుంది. కాబట్టి తను హీరోయిన్ పాత్రను మాత్రమే ఎంచుకోవాలని చూస్తున్నాను అంటూ ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక మొత్తానికైతే సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరి కంటే విభిన్నమైన కథాంశాలను ఎంచుకొని ముందుకు సాగడం విశేషం…ఇక ఫ్యూచర్ లో కూడా మరికొన్ని కొత్త సబ్జెక్టులతోనే మన ముందుకు వచ్చి మనల్ని మరింత అలరించడానికి తను రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక రామాయణం తో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆమె నటనకు ఫిదా అవుతారని చెప్పడం లో అతిశయోక్తి లేదు…