HomeNewsDavos Investments TG : పెట్టుబడుల్లో తెలంగాణ రైజింగ్.. ఆంధ్రప్రదేశ్ స్థానమేంటో?

Davos Investments TG : పెట్టుబడుల్లో తెలంగాణ రైజింగ్.. ఆంధ్రప్రదేశ్ స్థానమేంటో?

Davos Investments TG 16 ప్రముఖ సంస్థలు.. 1,64, 050 కోట్ల పెట్టుబడులు..(1.79 లక్షల కోట్లు అని కాంగ్రెస్ చెబుతోంది) 47,550 ఉద్యోగాలు.. పరోక్షంగా అంతకుమించి.. తెలంగాణ రైజింగ్(Telangana rising) అనే నినాదాన్ని నిజం చేసి చూపించాం.. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాదును నెలకొల్పాం.. కాంగ్రెస్ సోషల్ మీడియా గురువారం ఉదయం నుంచి ఇవే లెక్కలు చెబుతోంది.

తెలంగాణ సీఎంవో (Telangana CMO) చెబుతున్న వివరాల ప్రకారం..

Sun petrol chemicals

సన్ పెట్రో కెమికల్స్ అనే సంస్థ 45,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. ఈ కంపెనీ భారీపంప్డ్ స్టోరేజీ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తుంది. జల విద్యుత్తు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.. 3400 మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. 5,440 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది.

Amazon

అమెజాన్ కంపెనీ వెబ్ సర్వీసెస్ విభాగంలో పెట్టుబడులు పెట్టనుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్ విభాగంలో 60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

Control S

కంట్రోల్ ఎస్ అనే సంస్థ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. 400 మెగాబట్ల సామర్థ్యంతో డాటా సెంటర్ నిర్మించనుంది. ఇందులో భాగంగా 10 వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 3,600 మందికి ఉపాధి లభిస్తుంది.

JSW

JSW సంస్థ మానవ రహిత ఏరియల్ సిస్టం తయారీ యూనిట్ నెలకొల్పనుంది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తులను తయారుచేస్తుంది.. ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో కీ రోల్ ప్లే చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ 800 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 200 మందికి ఉద్యోగాలు అందిస్తుంది.

Sky root

స్కై రూట్ ఏరో స్పేస్ అనే సంస్థ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ లను తయారు చేయనుంది. ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ కోసం 500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది.

Mega engineering infrastructure limited

మేఘా( MEIL) కంపెనీ మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. 2,160 మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టును నిర్మించనుంది. అనంతగిరిలో వరల్డ్ క్లాసు లగ్జరీ వెల్నెస్ రిసార్టును నిర్మించనుంది 15వేల కోట్ల పెట్టుబడులను పెట్టడం ద్వారా 5,250 మందికి ఉపాధి కల్పిస్తుంది.

HCL

HCL కంపెనీ హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 5000 మందికి ఉపాధి లభిస్తుంది.

Wipro company

విప్రో కంపెనీ గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 5,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

Infosys company

ఇన్ఫోసిస్ పోచారంలో క్యాంపస్ ను విస్తరించనుంది. 750 కోట్లు పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా 17,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.

Unilever company

కామారెడ్డి జిల్లాలో యూనిలీవర్ కంపెనీ పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తుంది. బాటిల్ క్యాప్ లను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త తయారీ యూనిట్ ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

Tillman global holdings

టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్.. ఈ కంపెనీ హైదరాబాదులో అత్యధిక డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. మూడువేల మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ను నిర్మిస్తుంది. 15వేల కోట్లను దశలవారీగా పెట్టుబడులుగా పెడుతుంది.. వేలాది మందికి ఈ కంపెనీ ఉద్యోగాలు ఇస్తుంది.

Ursha clusters

ఉర్సా క్లస్టర్స్: ఈ కంపెనీ అమెరికన్ చెందింది. ఇది అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. 5000 కోట్లను పెట్టుబడులుగా పెడుతుంది..

Blackstone

బ్లాక్ స్టోన్: ఈ కంపెనీ ప్రపంచ అగ్రగామి సంస్థగా ఉంది.. ఇది 150 మెగా వాట్ల డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది..4,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ కంపెనీ వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది.

Akshat greentech

అక్షత్ గ్రీన్ టెక్: ఈ కంపెనీ అత్యధిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారు చేస్తుంది. దీనికోసం 7000 కోట్లను పెట్టుబడులుగా పెడుతోంది.

Eclat health solutions

ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్: ఈ కంపెనీ ఆరోగ్య సంరక్షణలో పేరుపొందింది.. ఇది 800 మందికి ఉద్యోగాలు అందించేలాగా హైదరాబాదులో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.

Suhana masala

సుహానా మసాలా: సంగారెడ్డిలో ప్రస్తుతం సుహాన ప్లాంట్ ఉంది. దీని పక్కనే ఎక్స్ లెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.

మరీ ఏపీలో..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ వెళ్లినట్టుగానే.. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర అధికారులు దావోస్ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కో కంపెనీతో ఒప్పందం మినహా.. మిగతా కంపెనీలతో ఎం ఓ యు లు, పెట్టుబడులు కుదుర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ప్రశ్నను గనుక టిడిపి లేదా దాని అనుకూల మీడియాను వేస్తే.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు కేవలం కనెక్టింగ్ ప్లాట్ ఫారం లాగానే ఉపయోగపడతాయి. అంతే తప్ప అక్కడే అన్ని కుదిరిపోవాలని లేదు. గతంలో మాత్రం దావోస్ విజయాలంటూ టిడిపి అనుకూల మీడియా ఊదరగొట్టింది. మరి ఇప్పుడు పెట్టుబడులు రాకపోవడానికి జగన్ నీచ విధానాలు.. నికృష్ట పరిపాలనే కారణమని ఆల్రెడీ మొదలుపెట్టారు. లోకేష్ ఆల్రెడీ అదే తిరుగా మాట్లాడుతున్నాడు. అధికారంలోకి జగన్ మరోసారి రాడని చెబితే తప్ప కార్పొరేటర్లు పెట్టుబడులు పెట్టరని అంటున్నాడు.. కనీసం ప్రచారం కోసమేనా చంద్రబాబు నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెబితే మీడియా ఎలాగూ డబ్బాలు కొడుతుంది కదా..

ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదా..

తెలంగాణ ను కెసిఆర్ మస్తు అభివృద్ధి చేశాడు.. అందువల్లే ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. కోట్లకు కోట్లను కార్పొరేటర్లు కుమ్మరిస్తున్నారని గులాబీ నాయకులు.. గులాబీ అనుకూల మీడియా ఇంకా ప్రచారం మొదలుపెట్టలేదనుకుంటా..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version