Telangana Farmers Urea Crisis: మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్‌లో చోటుచేసుకున్న ఘటన తెలంగాణ రైతుల దయనీయ పరిస్థితిని మరోసారి బయటపెట్టింది. యూరియా కోసం రైతులు పడే ఇబ్బందులు చూసిన ప్రతి ఒక్కరి హృదయం కలవరం చెందక మానదు. “సార్ మీ కాళ్లు మోక్కుతా… యూరియా ఇవ్వండి” అంటూ అధికారుల ముందుకు పడిపోతున్న రైతుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read: అప్పుడు జగన్ నా ప్రాణాలు కాపాడారు: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ పాలనలో రైతులకు ఊరట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు సమయానికి అందజేయడం వంటి చర్యలతో రైతులు ఎప్పుడూ క్యూల్లో నిలబడాల్సిన అవసరం రాకుండా చేసింది. రైతు సౌభాగ్యం అంటే కేవలం నినాదం కాదని ఆ పాలనలోని అనుభవం నిరూపించింది.
ఇప్పుడు పరిస్థితి ఎందుకీలా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం కొన్ని నెలల్లోనే రైతులు ఇంత దారుణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదా? లేక కేంద్రం నుంచి సరఫరా లోపించిందా? అనే ప్రశ్నలు ఎక్కడికక్కడ వినిపిస్తున్నాయి. రైతులు గోదాముల దగ్గర క్యూల్లో నిలబడి, ఎరువుల కోసం దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
రైతు కష్టమేనా? లేక పాలన వైఫల్యమా?
ఎరువుల కొరత వల్ల పంటలు ఎండిపోతాయేమోనన్న భయంతో రైతులు నిస్సహాయులవుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత సమయానికి యూరియా అందకపోతే మొత్తం కష్టమంతా వృథా కావడం ఖాయం. ఈ పరిస్థితిని తలచుకుంటే “ఎంతకు దిగజారిందయ్యా నా తెలంగాణ!” అంటూ ప్రతి ఒక్కరి మనసు కుదేలవుతోంది.
పరిష్కారం ఏమిటి?
రైతుల సమస్యలపై కేంద్రం–రాష్ట్రం పరస్పరం నెపాలు వేసుకుంటూ కాలం గడిపే పరిస్థితి కాదు. తక్షణమే యూరియా సరఫరా పెంచి, రైతులకు సకాలంలో అందేలా చూడటం అత్యవసరం. లేకపోతే ఈ సమస్య పెద్ద ఎత్తున వ్యవసాయ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.
Also Read: రేవంత్ రెడ్డి విన్నపం పనిచేస్తుందా?
రైతు కన్నీరు తుడవడం ప్రభుత్వాల కర్తవ్యమని గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. లేకపోతే తెలంగాణలో రైతు ఆత్మగౌరవం మాత్రమే కాదు, వ్యవసాయ భవిష్యత్తు కూడా చీకటిలో మునిగిపోతుంది.
నీ కాళ్ళు మోక్కుతా యూరియా ఇవ్వండి సారు!
యూరియా కోసం పిఏసిఎస్ సిబ్బంది కాళ్లు మొక్కుతున్న మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్ రైతు pic.twitter.com/AjGa1x7fYU
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025