HomeNewsరేపటి నుంచి పాస్ పోర్టు సేవల నిలిపివేత

రేపటి నుంచి పాస్ పోర్టు సేవల నిలిపివేత

తెలంగాణలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు పాస్ పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్రంలో కొవిడ్ ని అరికట్టేందుకు ప్రభుత్వం రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 21 వరకు లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ వల్ల సేవలను నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి వెల్లడించారు. లాక్ డౌన్ అనంతరం సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. పాస్ పోర్టు దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version