Tollywood Star Heroes: *రాజమౌళి-ఎన్టీఆర్, సుకుమార్-అల్లు అర్జున్, త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్.. ఇలాంటి కాంబినేషన్లు టాలీవుడ్ లో చాలా ఫేమస్. వీళ్లు సినిమా అనౌన్స్ చేస్తే చాలు కళ్లు మూసుకొని టికెట్ కొని థియేటర్లో వాలిపోతారు జనాలు.* అలాంటి కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రొడ్యూసర్స్ సైతం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే ప్రొడ్యూసర్స్ సైతం ఎక్కువ సంఖ్యలో రెమ్యూనరేషన్ ఇస్తూ వాళ్ళ కాంబినేషన్ ను మరోసారి కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ – సుకుమార్ కాంబో కి మంచి గుర్తింపైతే ఉంది. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. దాంతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. తొందర్లోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు…
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ కి కూడా చాలా మంచి గుర్తింపైతే ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండడం విశేషం… వీళ్ళు గతంలో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ని ప్రేక్షకులకు అందించారు. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే దాని మీద విపరీతమైన హైప్ ఉంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులో తన స్వాగ్ కనిపిస్తుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే జైలర్ సినిమాతో రజనీకాంత్ – నెల్సన్ ఇద్దరూ కలిసి గొప్ప విజయాన్ని సాధించారు. దాంతో ఇప్పుడు జైలర్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…
ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరోసారి ‘కల్కి 2’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. 2026 డిసెంబర్ లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకురావాలనే ఆలోచనలో అటు దర్శకుడు, ఇటు ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తున్నాడు…