BSBDA Account: ప్రస్తుత కాలంలో నగదు వ్యవహారాలు జరపడానికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా మారింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులతో పాటు మహిళలు, వృద్ధులు తమ నగదు వ్యవహారాలను బ్యాంకు ద్వారానే చేస్తున్నారు. అయితే చాలామందికి ప్రస్తుతం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నాయి. సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఈ అకౌంట్ పై డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటే వాటిపై అన్యువల్ చార్జెస్ ఉంటాయి. అంతేకాకుండా ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా లిమిట్స్ ఉండి.. పరిమితి దాటితే చార్జీలు విధిస్తున్నాయి. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన ప్రకారం సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లను BSBD బ్యాంక్ అకౌంట్లుగా మార్చుకోవచ్చు. అసలు ఈ BSBD బ్యాంకు అకౌంట్లో అంటే ఏమిటి? వీటివల్ల ఏమి ఉపయోగం?
సాధారణంగా బ్యాంకు వ్యవహారాలు లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. అయితే చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్ జరిపే వారికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో 2012లో Basic Saving Bank Deposit (BSBD) అకౌంట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. పేద లేదా దూర ప్రాంతాల వారికి బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించడం ఈ అకౌంట్లో ఉద్దేశం. ఈ అకౌంట్లో ద్వారా పింఛన్లు, స్కాలర్షిప్లు, గవర్నమెంట్ సబ్సిడీలు, గ్యాస్ సబ్సిడీలు పొందుతారు. యువత, కార్మికులు, గ్రామీణ ప్రజలు వీటి ద్వారా సేవలను పొందుతారు. సాధారణ బ్యాంకు అకౌంట్లో కంటే వీటిలో చార్జీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ బ్యాంకు అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఖాతాలు కలిగి ఉంటుంది. వీటికి ఉచితంగా డెబిట్ కార్డు అందిస్తారు. డిపాజిట్లను చేసుకునే సమయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. అలాగే ప్రతి నెలలో నాలుగు సార్లు ఏటీఎం ద్వారా విత్ డ్రాయాలు చేసుకోవచ్చు. ఈ బ్యాంకు ఖాతాలకు ఎలాంటి బ్యాంకు చార్జీలు వేయరు. మిగతా వాటి కంటే సురక్షితంగా ఉంటుందని అంటుంటారు.
అయితే ఇప్పుడు కొత్తగా ఆర్.బి.ఐ తెలిపిన సమాచారం ప్రకారం సాధారణ బ్యాంకు అకౌంట్లు కూడా బిఎస్ బీడీ గా మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. అంటే ఇప్పటివరకు కమర్షియల్ అకౌంట్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులో ఉన్న అకౌంట్ లు BSBD అకౌంట్ గా మార్చుకోవచ్చు. ఇలా మారిన తర్వాత BSBD కి ఉండే రూల్స్ వర్తిస్తాయి. సాధారణ అకౌంట్లో నుంచి వీటిని మార్చడానికి ఏడు రోజుల ప్రాసెస్ అవుతుంది. అయితే ప్రతి ఖాతాదారులు ఒక బిఎస్ బీడీ బ్యాంక్ అకౌంటు మాత్రమే కలిగి ఉండాలి. ఏప్రిల్ 1 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు ముందే ఖాతాదారులకు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చి ఛాన్స్ ఉంది.