Mahesh-Rajamouli movie : మహేష్, రాజమౌళి మూవీ రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించిన వివరాల కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా రాజమౌళి పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూస్తే అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది. గత ఆరు నెలలుగా ఈ వర్క్ షాప్ బ్రేక్ లేకుండా కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తన సినిమాలోని నటీనటులు మొత్తం పక్కా ట్రైనింగ్ అయ్యాకనే కెమెరా ముందుకు రావాలనే బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ ఇండియా లోనే మొట్టమొదటిసారి తెరకెక్కుతుంది. మహేష్ ఈ చిత్రం కోసం కోయ బాషతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాడు. అంతే కాకుండా ఆఫ్రికన్ కల్చర్ ని కూడా బాగా పరిశీలిస్తున్నాడు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ మూవీ వర్క్ షాప్ లో ప్రముఖ బాలీవుడ్/ హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో విలన్ గా ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ని తీసుకున్నట్టు సోషల్ మీడియా లో గత మూడు నెలలుగా ప్రచారం అవుతూనే ఉంది. మూవీ టీం ఆయన్ని సంప్రదించిన విషయం వాస్తవమే. ఆయనపై లుక్ టెస్ట్ కూడా జరిగింది. అయితే రాజమౌళి రెండేళ్ల బల్క్ కాల్ షీట్స్ అడగడంతో పృథ్వీ రాజ్ నా వల్ల కాదంటూ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడట. ఎందుకంటే పృథ్వీ రాజ్ మలయాళం లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయన సినిమా హిట్ అయితే కనీసం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. ఏడాదికి కనీసం ఆరు సినిమాలు చేస్తాడు.
హీరోగా అంత బిజీ గా ఉన్న ఆయన, ఒక ఆరు నెలల డేట్స్ అయితే ఇవ్వగలడు కానీ, రెండేళ్ల డేట్స్ అంటే కష్టమే. అందుకే ప్రాక్టికల్ గా నాకు వర్కౌట్ అవ్వదని ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. దీంతో ఆయన స్థానంలోకి ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం ని తీసుకున్నారు. రీసెంట్ గానే ఆయన వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఒక సెట్ లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం పై ఒక సన్నివేశాన్ని కూడా చిత్రీకరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్ అబ్రహం పేరుకి ఇండియన్ హీరోనే కానీ, చూసేందుకు హాలీవుడ్ రేంజ్ హీరో అని అనిపిస్తాడు. ఆ స్థాయిలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. మహేష్ బాబు కి ఎదురుగా నిలబడాలంటే ఆ మాత్రం స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి, పర్ఫెక్ట్ సెలక్షన్ అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేసి పోస్టులు వేస్తున్నారు మహేష్ అభిమానులు.