Maha kumbh Mela : మహా కుంభమేళ ఇప్పటివరకు జరిగిన తీరు ఒక ఎత్తు కాగా.. గురువారం నాడు మౌని అమావాస్య జరిగింది. ఈ మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళకు భారీగా భక్తులు హాజరయ్యారు. బుధవారం ఒక్క రోజే ఆరు కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. బుధవారం మధ్యాహ్నం వరకే 5.71 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇక మంగళవారం 19.94 కోట్ల మంది స్థానాలు చేశారు.. బుధవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకోవడంతో దాదాపు 20 మంది భక్తులు కన్నుమూశారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో పెను విపత్తు చోటు చేసుకోలేదు. మౌని అమావాస్య కావడంతో భక్తులు స్నానం చేయడానికి పోటీపడ్డారు. దీంతో ఒక్కసారిగా రద్దు ఏర్పడింది. వారందరిని నిలువరించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారంతా ఒక్కసారిగా తీసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఫలితంగా 20 మంది కన్నుమూశారు. ఈ ఘటనను అటు రాష్ట్ర, ఇటు కేంద్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకున్నాయి. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు.. గాయపడ్డ వారికి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించాయి.
ఇసుకేస్తే రాలనంతగా..
ప్రయాగ్ రాజ్ ప్రాంతం ఇసుకేస్తే రాలనంతగా మారిపోయింది. జనాలు భారీగా రావడంతో గంగానది ప్రాంతం కోలాహలంగా మారింది. కోట్లాదిమంది భక్తులు ఎక్కడెక్కడ నుంచే రావడంతో పుణ్య స్నానాలు చేస్తున్న ప్రాంతం రద్దీగా మారింది. ఈ స్థాయిలో భక్తులు వస్తున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తుగా సౌకర్యాలు కల్పించడంతో కాలుష్యం అనేది ఏర్పడటం లేదు. పైగా ఈ పరిస్థితిని ముందుగానే గురించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగ్ ప్రాంతంలో జపాన్ తరహాలో మియావాకి విధానంలో చిట్టడువులు పెంచింది. ఫలితంగా గాలిలోకి భారీగా ఆక్సిజన్ పంప్ అవుతోంది. అంతమంది భక్తులు వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో స్నానాలు చేస్తున్నప్పటికీ కాలుష్యం అనేది ఏర్పడటం లేదు. అందువల్లే దుర్వాసన వెదజల్లడం లేదు.. అయితే బుధవారం మౌని అమావాస్య కావడం.. తొక్కి సలాట చోటుచేసుకుని 20 మంది చనిపోవడాన్ని యూపీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. అయితే తొక్కిసలాటకు దారి తీసిన సంఘటనలపై ఇప్పటికే పోలీసులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి హెచ్చరించారు. కుంభమేళ మూగియడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో.. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని.. అధికారులు కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. ఇక ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో భక్తులు గంగా నదిలో స్నానం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి.