https://oktelugu.com/

SRH vs RR 2024: చెన్నైలో మారిన వాతావరణం.. వర్షం కురిసి క్వాలిఫైయర్ -2 మ్యాచ్ రద్దయితే.. ఎస్ ఆర్ హెచ్ పరిస్థితి ఏంటి?

చెన్నైలోని వాతావరణ శాఖ శుక్ర వారం వర్షం కురుస్తుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై తో పాటు మరో ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 23, 24 తేదీలలో అది భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 24, 2024 / 12:39 PM IST

    SRH vs RR 2024, IPL Qualifier 2 Match

    Follow us on

    SRH vs RR 2024: ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే కోల్ కతా జట్టు ఫైనల్ వెళ్ళిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు పై రాజస్థాన్ గెలిచింది. క్వాలిఫైయర్ -2 లో శుక్ర వారం చెపాక్ స్టేడియం వేదికగా హైదరాబాద్, రాజస్థాన్ జట్లు తలపడాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్లి..కోల్ కతా ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని అటు రాజస్థాన్, ఇటు హైదరాబాద్ జట్లు భావిస్తున్నాయి. అయితే చెన్నైలో గురు వారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శుక్రవారం కూడా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణం కూడా మారడంతో రెండు జట్ల అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం కురిసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్వాలిఫైయర్ -2 మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి.

    చెన్నైలోని వాతావరణ శాఖ శుక్ర వారం వర్షం కురుస్తుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. చెన్నై తో పాటు మరో ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 23, 24 తేదీలలో అది భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది.. ఒకవేళ వర్షం కురిస్తే క్వాలిఫైయర్ మ్యాచ్ – 2 రద్దయితే పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నై వేదికగా జరగాల్సి ఉంది. ఆరోజు కూడా వర్షం పడితే పరిస్థితి ఏంటి అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే.. క్వాలిఫైయర్ -2 పోరుకు రిజర్వ్ డే ఉందని ఐపీఎల్ నిర్వాహకులు చెబుతున్నారు.. హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయితే.. రిజర్వ్ డే అయిన మరుసటి రోజు శనివారం కొనసాగిస్తారు. క్వాలిఫైయర్ -2 తో పాటు, ఫైనల్ మ్యాచ్ కు కూడా రిజర్వ్ డే కేటాయించారు. క్వాలిఫైయర్ మ్యాచ్ రిజర్వ్ డే రోజు కూడా ఫలితం తేలకపోతే.. పాయింట్లు పట్టికలో టాప్ స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. అలా చూస్తే హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్లే అవకాశం ఉంది.

    మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు అయితే.. రిజర్వ్ డే రోజు కూడా నిర్వహించడం సాధ్యం కాకపోతే.. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న జట్టు విజేతవుతుంది. అప్పుడు కోల్ కతా ఐపీఎల్ కప్ ను దక్కించుకుంటుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు వర్షం వల్ల ఏ ఫైనల్ మ్యాచ్ కూడా రద్దు కాలేదు. గత సంవత్సరం వర్షం వల్ల చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కి ఆటంకం ఏర్పడితే.. రిజర్వ్ డే రోజున నిర్వహించారు. ఆరోజున జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు విజయం సాధించి.. ఐదవ సారి ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకుంది.