IPL 2025: ఈ స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోబోతున్న ఎస్ ఆర్ హెచ్ టీం… ఇక వీళ్ళతో మామూలుగా ఉండదు…

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న ఏకైక క్రికెట్ లీగ్ ఐపీఎల్...ప్రస్తుతం ఐపీఎల్ లో భారీ కసరత్తులను చేస్తూ ఆయా టీమ్ లు ఎలాగైనా సరే గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : October 17, 2024 8:59 am

IPL 2025(1)

Follow us on

IPL 2025: ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులు ఇండియన్ టీం ఆడే క్రికెట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మన టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఎలాంటి మ్యాచ్ నైనా సరే అలవొకగా గెలిపించగలిగే సత్తా మన ప్లేయర్ల దగ్గర ఉండడం వల్ల మనవాళ్ళు ఆడే ఆట మీద విదేశీ ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అందులో భాగం గానే ఐపిఎల్ మీద విదేశీయులు సైతం చాలా మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొంటారు…

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న ఏకైక క్రికెట్ లీగ్ ఐపీఎల్…ప్రస్తుతం ఐపీఎల్ లో భారీ కసరత్తులను చేస్తూ ఆయా టీమ్ లు ఎలాగైనా సరే గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే అత్యధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి మరి స్టార్ క్రికెటర్లను తమ టీం లోకి తీసుకోవడానికి ప్రాంచైజ్ లు సైతం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు వచ్చే సంవత్సరం మెగా యాక్షన్ జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ లో ఉన్న అన్ని టీమ్ లకు ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురవ్వబోతోంది. ఎందుకంటే ఆ టీమ్ లోని కొంతమందిని రీటైన్ చేసుకొని ఇంకా కొంత మంది ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

దానివల్ల ఆయా టీమ్ లు భారీగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆక్షన్ లో చాలామంది ప్రాంఛైజ్ లు చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మరి కొంతమంది ప్లేయర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ప్లేయర్లని ఆక్షన్ లోకి వదిలేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి వాళ్లు పెట్టిన మనీ వల్ల ప్రాంచైజ్ లు కొంతవరకు నష్టపోతున్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ సన్రైజర్స్ టీం ఈ సీజన్ లో చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చింది…

ఒక దానికి గాను ఆ టీమ్ కెప్టెన్ అయిన పాట్ కమ్మిన్స్ టీమ్ లోనే కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన కెప్టెన్ అయిన తర్వాతే హైదరాబాద్ టీమ్ చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. కాబట్టి ఆయన అద్భుతమైన కెప్టెన్సీకి ప్రతీకగా ఆయనను టీమ్ లోనే కొనసాగిస్తున్నారు…

ఇక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అయిన క్లాసెన్ ను హైదరాబాద్ టీం 23 కోట్లు పెట్టి మరి రిటెన్షన్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈయనతో పాటు గా పాట్ కమ్మిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ లను 14 కోట్లు పెట్టి రిటెన్షన్ చేస్తున్నారు. ఇక వీళ్ళ తోపాటుగా హెడ్, నితీష్ కుమార్ రెడ్డి లు కూడా టీమ్ ను అంటిపెట్టుకొని ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్లేయర్ల రిటెన్షన్ ను ఫైనల్ చేసేందుకు ఐపీఎల్ ప్రాంచైజ్ లకు ఈనెల 30వ తేదీ వరకి మాత్రమే గడువు ఇచ్చారు…