https://oktelugu.com/

Vijay Varma : పెళ్లి వాయిదా పడటంతో ఏడ్చేసిన నటుడు…అతన్ని అలా చూడటం మా వాళ్ల కాలేదంటున్న విజయ్ వర్మ…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉంటారు. నిజానికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా రాణిస్తూ వాళ్లని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక టాలెంట్ లేనివారు మాత్రం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమై ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 17, 2024 / 08:46 AM IST

    Actor who cried because of wedding postponement...Vijay Varma says it is not ours to see him like that...

    Follow us on

    Vijay varma : ఇండస్ట్రీలో కొంతమంది విలక్షణ నటులు ఉంటారు. వాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి నటులు చాలామంది ఉన్నారు. ఇక జైదీప్ ఆహ్లావత్ మహారాజా అనే వెబ్ సిరీస్ తో ముందుకు వచ్చి ఈ సంవత్సరం చాలా బాగా సక్సెస్ అయ్యాడు. ఒక జైదీప్ అహ్లవత్ అలాగే విజయ్ వర్మ ఇద్దరూ మొదటి నుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. పూణేలోని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. ఇక అలాగే భాగి3, జానే జాన్ లాంటి సినిమాల్లో కూడా కలిసి నటించారు. ముఖ్యంగా జైదీప్, విజయ్ వర్మ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో మంచి నటులుగా గుర్తింపు పొందుతుందటం విశేషం…ఇక ఇదిలా ఉంటే వీళ్లిద్దరూ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ముఖ్యంగా జైదీప్ తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తూ నా జూనియర్ జ్యోతి హుడాతో 2009వ సంవత్సరంలో నా పెళ్లి జరిగింది.
    ఇక దానికి విజయ్ వర్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని బట్టలు కూడా తీసుకొని పెళ్లికి రావడానికి రెడీ అయ్యారు. ఇక ఇంతలో అక్షయ్ కుమార్ ‘కట్టా మీట’ షూట్ ఉండడంతో నా పెళ్లిని వాయిదా వేసాము అని చెబుతుండగానే వెంటనే విజయవర్మ అందుకొని అప్పుడు మా టికెట్లను ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మరోసారి టిక్కెట్లు కొనేంత డబ్బులు కూడా మా దగ్గర లేవు. కాబట్టి మేము అతని పెళ్లికి వెళ్లలేకపోయాము. అలాగే ఒక 6 నుంచి 8 నెలల వరకు మా ఫ్రెండ్స్ ఎవ్వరూ జైదీప్ తో మాట్లాడలేదు అంటూ విజయవర్మ కామెంట్స్ చేశాడు.
    ఇక దాంతో జైదీప్ కూడా వీళ్లే కాకుండా మిగతా ఫ్రెండ్స్ ఎవరు కూడా నా పెళ్ళికి హాజరు కాకపోవడం నాకు చాలా బాధను కలిగించింది అని బాధపడ్డాడు… ఇక తర్వాత కొన్ని నెలలకి మేము కలుసుకున్నప్పుడు జైదీప్ నా పెళ్ళికి ఎవరు రాలేదు అంటూ ఒక్కసారి గా ఏడ్చేశాడు.దాంతో అతన్ని అలా చూడగానే మా అందరికి దుఖం ఆగలేదు అంటూ విజయ వర్మ చెప్పడం విశేషం…
    ఇక మొత్తానికి అయితే ఈ నటులిద్దరూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక విజయ్ వర్మ కూడా తమన్నాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక తొందర్లోనే వీళ్ళు పెళ్లి పీటలేక్కబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది…