HomeతెలంగాణAllu Arjun : ఆర్య సినిమాలో అల్లు అర్జున్ హీరో అంటే అందరు నవ్వారు అంటూ...

Allu Arjun : ఆర్య సినిమాలో అల్లు అర్జున్ హీరో అంటే అందరు నవ్వారు అంటూ సంచలన కామెంట్స్ చేసిన సుకుమార్…

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా దర్శకుడి ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్నప్పటికి ఆయన చేస్తున్న సినిమాల్లో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఆయన అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక దాంతో ‘పుష్ప 2’ మీద భారీ కసరత్తులను చేస్తున్నాడు. ఇక డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందని భావిస్తున్నాడు. అందుకే ఆయన పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 భారీ సక్సెస్ ని సాధిస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన అల్లు అర్జున్ తో నాలుగు సినిమాలను చేశారు. మరి వీళ్ళ బాండింగ్ అనేది అంతా బాగా ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇక రిసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుకుమార్ ఆర్య సినిమా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. నా మొదటి సినిమా అయిన ఆర్య సినిమాలో అల్లు అర్జున్ ను హీరోగా ఎంపిక చేసుకోవడం మీద కొంతమంది కామెంట్స్ చేశారని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశాడు. ముఖ్యంగా దిల్ సినిమా షూట్ జరిగే సమయంలో నేను రాసుకున్న కొన్ని మాంటేజ్ సీన్స్ ను దిల్ రాజు కు చెబుతూ ఉండేవాడిని దాంతో దిల్ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా నీకు సినిమా చేసే అవకాశం ఇస్తాను అంటూ దిల్ రాజు మాటిచ్చాడు.

ఇక దిల్ సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అవ్వడంతో దిల్ రాజు గుర్తుపెట్టుకొని మరి నన్ను పిలిపించి నేను రాసిన కథను విని సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఇక దాంతో హీరో ఎవరైతే బాగుంటుందని నేను హీరో వేటలో పడ్డాను. ఇక అనుకోకుండా ఒక రోజు దిల్ ప్రివ్యూ కి అల్లు అర్జున్ రావడం అక్కడ ఆయన మా అందరిని పలకరించిన తీరు, చాలా యాక్టివ్ గా ఉన్న విధానం నాకు కనిపించింది. దాంతో ఆర్య క్యారెక్టర్ కి తను సరిపోతాడని నా ఫ్రెండ్స్ దగ్గర చెప్పాను కానీ మొదట్లో అందరూ నవ్వారు…

ఆ తర్వాత అల్లు అర్జున్ అందరితో మాట్లాడుతూ అందర్నీ పలకరిస్తూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా బన్నీ చూసి ఆర్య క్యారెక్టర్ కి బన్నీ నే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పారు. దాంతో ఇప్పుడు నేను ఈ విషయాన్ని చెప్పి బన్నీ తో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాం అంటూ ఆయన అప్పటి రోజులను పంచుకోవడం అనేది నిజంగా సుకుమార్ అభిమానులను అల్లు అర్జున్ అభిమానులను చాలా ఆనందానికి గురిచేస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version