Wife ties Rakhi Her Husband: ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రధాన పండుగ రక్షాబంధన్. పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగ ను హిందువులు వైభవంగా జరుపుకుంటారు. సోదరులకు సోదరులు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని తెలియజేస్తారు. అందుకు ప్రతిరూపంగా సోదరులు తమ చెల్లెళ్లకు బహుమతులు అందిస్తారు. అయితే ఈ వేడుక నిర్వహించేందుకు సుదూర ప్రాంతాల నుంచి తమ పుట్టినిల్లుకు మహిళలు తరలివస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు మొత్తం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే రాఖీ పండుగ అనగానే అన్నకు చెల్లి కట్టే రక్ష అని అందరికీ తెలుసు. కానీ రాఖీని భార్య భర్తకు కట్టవచ్చా? ఇందుకు పురాణాలు ఏం చెబుతున్నాయి? మనదేశంలో భర్తకు భార్య రాఖీ కట్టే సాంప్రదాయం ఎక్కడ నిర్వహిస్తారు?
సోదరుడికి సోదరి రాఖీ కడుతూ నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. అంటూ చెబుతోంది. అంటే జీవితాంతం ఒకరికొకరు తోడు ఉండాలని కోరుకుంటారు. అయితే రాఖీని కేవలం సోదరుడికి సోదరీ మాత్రమే కాకుండా.. భర్తకు భార్య కూడా కట్టే సాంప్రదాయం మన దేశంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడ జిల్లా గోండు గిరిజనులు రాఖీ పండుగను విభిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ సోదరీమణులు తమ సోదరులకు కాకుండా భర్తలకు మాత్రమే రాఖీ కడతారు. రాఖీ అంటే ఒకరికి ఒకరు రక్షగా ఉండడం అని భావిస్తారు. అలా ఒకరికి ఒకరు భార్య భర్తలు కలిసి ఉండాలని ఉద్దేశంతో అలా జరుపుకుంటారని చెబుతున్నారు. రక్షాబంధన్ రోజున పొలాల్లోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి. పంటలకు కూడా రాఖీ కడతారు. అలాగే ఇక్కడ అడవుల్లో నిలిచే చెట్లకు కూడా రాఖీ కడతారు.
Read Also: సుంకాల సవాల్.. ఇండియాకు ఇదో అవకాశం.. ఆనంద్ మహీంద్రా సూచనలు
అయితే ఇలా భర్తకు భార్య రాఖీ కట్టే సాంప్రదాయం పురాణాల్లో కూడా ఉంది. వేద కాలంలో దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ సమయంలో రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో దేవతలకు రాజు అయిన ఇంద్రుడు భయపడి పోతాడు. తన గురువు అయిన బృహస్పతిని సలహా అడుగుతాడు. ఈ సమయంలో బృహస్పతి ఒక మాట చెబుతాడు. తన భార్య ఇంద్రాణితో రాఖీ కట్టమని చెబుతాడు. శ్రావణ పౌర్ణమి రోజున ఇంద్రాణి ఇంద్రుడికి రాఖీ కట్టి యుద్ధంలోకి వెళ్ళమని చెబుతుంది. దీంతో ఆ యుద్ధం విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇలా భార్య ఇంద్రాణి రాఖీ కట్టడం వల్లే ఇంద్రుడికి విజయం సాధించిందని చెబుతారు. అలాగే శ్రీకృష్ణుడి మణికట్టుకు గాయం అవుతుంది. ఈ సమయంలో ద్రౌపతి అది చూసి ఆందోళన పడుతుంది. వెంటనే తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి మణికట్టుకు కడుతుంది. ఇలా తన చీర కొంగును చింపి కట్టడం వల్ల శ్రీకృష్ణుడికి గాయం మానుతుంది. ఇందుకు ప్రతిరూపంగా శ్రీకృష్ణుడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం లో సాయం చేశాడని చెబుతారు.