https://oktelugu.com/

Smartphone Remote: టీవీ రిమోట్ పోతే బెంగ ఎందుకు .. స్మార్ట్ ఫోన్ ఉంది కదా..

టీవీ రిమోట్ ఎక్కడ పెట్టి మర్చిపోవడం.. దానికోసం విపరితంగా వెతకడం.. దాదాపు అందరూ ఇళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. మంచం కిందనో, సోఫా పైన్నో పెట్టి మర్చిపోతుంటాం.

Written By:
  • Gopi
  • , Updated On : May 7, 2024 8:10 am
    Smartphone Remote

    Smartphone Remote

    Follow us on

    Smartphone Remote: ఒకప్పుడంటే ట్యూనర్ ద్వారా టీవీ చానల్స్ మార్చేవాళ్ళు. ఇప్పుడు రిమోట్లు వచ్చాయి. అందులోనూ అధునాతనమైన రిమోట్స్ చేతులను ఆక్రమించాయి. ఒక్కోసారి మతిమరపు వల్ల టీవీ రిమోట్ కనిపించదు. కొన్నిసార్లు అది పాడైపోతుంది. అలాంటప్పుడు లక్షల పోసి కొన్న స్మార్ట్ టీవీ ని ఆపరేట్ చేయడం కష్టమైపోతుంది. అలాంటప్పుడు కొత్త రిమోట్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉండగా.. రిమోట్ అవసరం లేదు. ఎందుకంటే..

    టీవీ రిమోట్ ఎక్కడ పెట్టి మర్చిపోవడం.. దానికోసం విపరితంగా వెతకడం.. దాదాపు అందరూ ఇళ్లలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. మంచం కిందనో, సోఫా పైన్నో పెట్టి మర్చిపోతుంటాం. సమయానికి అది దొరకపోవడంతో ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉండదు. నచ్చిన సినిమా చూసే సౌలభ్యం కలగదు. అంతేకాదు ఛానల్ మార్చేందుకు వీలుపడదు. సౌండ్ పెంచడం లేదా తగ్గించడం కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం స్మార్ట్ టీవీలకు సరిపోయే రిమోట్ దొరికేంతవరకు టీవీ ని ఆపరేట్ చేయడం కుదరదు. రిమోట్ దొరకనప్పుడు మాత్రమే కాదు, అది పాడైతే కూడా టీవీని ఆపరేట్ చేసే అవకాశం ఉండదు.

    అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ ను టీవీ రిమోట్ గా మార్చొచ్చు. టీవీని నియంత్రించవచ్చు. సౌండ్ తగ్గించడం లేదా పెంచడం చేయొచ్చు. అదే కాదు చానల్స్ ని కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు.

    మీ స్మార్ట్ ఫోన్ టీవీ రిమోట్ కావాలి అనుకుంటే..

    ముందుగా స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ ని బ్లూటూత్ లేదా వైఫై ద్వారా కనెక్ట్ చేయాలి.

    అనంతరం ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ టీవీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని ఇన్ స్టాల్ చేసి, ఓపెన్ చేయాలి.

    అలా ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ కింద వైపు రైట్ కార్నర్లో రిమోట్ బటన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిని వెంటనే యాప్ సమీపంలో ఉన్న డివైజ్ లను కనెక్ట్ చేసేందుకు స్కాన్ చేయడం మొదలు పెడుతుంది. ఆ జాబితాలో మీ టీవీ పేరు కనిపించగానే వెంటనే దానిని ఎంచుకోవాలి.. ఆ తర్వాత టీవీ స్క్రీన్ పై ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ను స్మార్ట్ ఫోన్ లోని యాప్ లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పెయిర్ బటన్ నొక్కాలి. దీంతో స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్ ఫెయిర్ అవుతాయి.

    ఇలా అయిన వెంటనే స్మార్ట్ ఫోన్ ద్వారా స్మార్ట్ టీవీ ని ఆపరేట్ చేయవచ్చు. టీవీ శబ్దాన్ని తగ్గించడం లేదా పెంచడం చేయొచ్చు. చానల్స్ ను అత్యంత స్వేచ్ఛగా మార్చవచ్చు. పాస్ వర్డ్ లు నమోదు చేయడం.. వాయిస్ సెర్చ్.. నావిగేషన్ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టొచ్చు.

    ఈ ప్రక్రియ మాత్రమే కాదు.. స్మార్ట్ ఫోన్ ను టీవీ రిమోట్ గా మార్చే అనేక రకాల యాప్స్ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో any mote smart IR remote App ముఖ్యమైనది. ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని సులభంగా వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలా వరకు కంపెనీలు సొంతంగా రిమోట్ యాప్ లను తయారు చేశాయి. వీటిని కూడా యూజర్లు ఉపయోగించుకోవచ్చు. అమెజాన్ ఫైర్ స్టిక్, గూగుల్ క్రోమ్ కాస్ట్, అల్ట్రా వంటి స్ట్రీమింగ్ డివైస్లు వాడుతూ ఉంటే.. వాటిని కూడా దర్జాగా స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించుకోవచ్చు.