Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ క్రమశిక్షణ కోల్పోయాడని.. రంజి క్రికెట్ సరిగ్గా ఆడటం లేదని.. చెప్పినట్టు వినడం లేదని.. బీసీసీఐ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతని పేరు తొలగించింది. కీలకమైన సిరీస్ లకు దూరం పెట్టింది. కానీ ఎప్పుడైతే గత ఐపిఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ను ముందుండి నడిపించాడో.. ఆ జట్టుకు ట్రోఫీ ని అందించాడో.. అప్పటినుంచి అయ్యర్ కు అవకాశాలు రావడం మొదలైంది. అయితే అతను అనుకున్నంత ఈజీగా జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం లభించింది. దానికంటే ముందు రంజీలలో ఆడిన శ్రేయస్ అయ్యర్.. తన సత్తా ఏమిటో చూపించాడు. మొత్తంగా చాంపియన్స్ ట్రోఫీలో స్థానం సంపాదించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మెరుగ్గా పరుగులు చేశాడు. టీమిండియా సాధించిన విజయాలలో కీలక భూమిక పోషించాడు. దీంతో అతనిపై బీసీసీఐ పెద్దలు కాస్త మెత్తబడ్డారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చూపించిన ప్రతిభ ఆధారంగా శ్రేయస్ అయ్యర్ ను ఐసీసీ మార్చి నెలకు ఉత్తమ క్రికెటర్ గా ప్రకటించింది.
Also Read : బెంగళూరు వదిలేసిన దరిద్రాన్ని.. పంజాబ్ నెత్తిన పెట్టుకొంది.. ఫలితం అనుభవిస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కినట్టేనా
మార్చి నెలలో ఉత్తమ క్రికెటర్ అవార్డు కు శ్రేయస్ అయ్యర్ ఎంపికైన నేపథ్యంలో.. అతడిని అభినందిస్తూ బిసిసిఐ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. కంగ్రాట్యులేషన్స్ శ్రేయస్ అయ్యర్. మార్చి నెలకు సంబంధించి ఐసీసీ ఉత్తమ క్రికెటర్ గా ఎంపికైనందుకు.. నీకు శుభాకాంక్షలు” అంటూ ఆ పోస్టర్లో పేర్కొంది. బిసిసిఐ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో.. రకరకాల వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. ” శ్రేయస్ అయ్యర్ కొంతకాలంగా నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాడు. అందువల్ల అతని విషయంలో బీసీసీఐ పెద్దలు కాస్త మెత్తబడ్డారు. బహుశా సెంట్రల్ కాంట్రాక్టులో అతనికి స్థానం లభించవచ్చు. గతంలో కోల్పోయిన ఆ స్థానాన్ని అయ్యర్ మళ్ళీ పొందే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే అయ్యర్ కెరియర్ మరోవైపు టర్న్ తీసుకున్నట్టే. గతంలో ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు అయ్యర్ నాయకత్వం వహించాడు. ప్రస్తుత టీమిండియా కోచ్ నాడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. అప్పుడే వారిద్దరి మధ్య బలమైన బాండింగ్ ఉంది. బహుశా గౌతమ్ గంభీర్ అయ్యర్ కు తెర వెనుక తోడ్పాటు అందిస్తుండవచ్చు . అందువల్లే అతడికి అన్ని మంచి శకనము లే ఎదురవుతున్నాయి. ఇక ఇటీవల పంజాబ్ జట్టు కోచ్ రికి పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ ను కాబోయే భావిభారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవన్నీ నెరవేరుతాయి అని.. అవన్నీ ఎంతో దూరంలో లేవని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
BCCI POSTER FOR SHREYAS IYER ON WINNING ICC PLAYER OF THE MONTH AWARD. pic.twitter.com/Z4z5yEtSfj
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025