https://oktelugu.com/

Sathyaraj daughter: కట్టప్ప కూతురును చూస్తే.. కళ్లు షేక్ అవుతాయి.. ఎలా ఉందంటే?

Sathyaraj daughter: కొందరు సినిమా నటులు వెండితెరపై కనిపిస్తూ.. తమ సొంత విషయాలు కూడా మీడియాతో పంచుకుంటారు. మరికొందరు మాత్రం అందుకు వ్యతిరేకంగా మీడియాకు దూరంగా ఉంటారు.

Written By: , Updated On : June 24, 2024 / 01:41 PM IST
Sathyaraj daughter Divya Photos Goes Viral

Sathyaraj daughter Divya Photos Goes Viral

Follow us on

Sathyaraj daughter: సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు స్టార్ హీరోలకు వారి సొంత పేర్ల కంటే.. వారు నటించిన పాత్రల పేర్లతోనే ఎక్కువగా పిలుస్తారు. అలా పాపులర్ అయిన చాలా మంది నటులు తమ సొంత పేర్లను మరిచిపోయారు. తమిళ నటుడు సత్యరాజ్ అలనాడు స్టార్ హీరో. రజనీకాంత్, కమలాసన్ వంటి వారితో సమానంగా నటించిన ఆయన ఆ తరువాత క్యారెక్టర్ ఆర్ఠిస్టుగా నటిస్తున్నారు. సత్యరాజ్ తమిళంతో పాటు తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్నాడు. తెలుగులో వచ్చిన ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప వేషంతో ఆయన పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సత్యరాజ్ ను కట్టప్ప అనే పిలుస్తున్నారు. అయితే ఇటీవల సత్యరాజ్ కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె స్టార్ హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎలా ఉందంటే?

కొందరు సినిమా నటులు వెండితెరపై కనిపిస్తూ.. తమ సొంత విషయాలు కూడా మీడియాతో పంచుకుంటారు. మరికొందరు మాత్రం అందుకు వ్యతిరేకంగా మీడియాకు దూరంగా ఉంటారు. సత్యరాజ్ సినిమాల్లో స్టార్ అయినా.. తన సొంత విషయాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. వీరిలో కుమారుడు ఇప్పటికే ‘డోరా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మరో మూవీ చేశాడు. సత్యరాజ్ కు కూతురు దివ్య సత్యరాజ్ ఉన్నారు.

Also Read: Tollywood : చిన్నప్పుడు తను నవ్వి.. ఇప్పుడు అందరినీ నవ్విస్తున్న ఈ కుర్రాడి గురించి తెలుసా?

దివ్య సత్యరాజ్ ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఉన్నారు. అందం, ఆకర్షణీయమైన లుక్ తో ఆకట్టుకుంటున్నారు. అయితే ఆమె సినిమాల్లోకి మాత్రం రాలేదు. సాధారణంగా సినిమా నటుల వారసులుగా కొడుకులతో పాటు కూతుళ్లు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ సత్యరాజ్ కూతురు దివ్య మాత్రం గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆమె న్యూట్రిషన్ గా కొనసాగుతూ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

Also Read: Pawan Kalyan : పవన్ వద్దకు క్యూ కడుతున్న సినీ పెద్దలు

అయితే లేటేస్టుగా తన ఖాతాలో దివ్య కొన్ని పిక్స్ షేర్ చేశారు. ఇందులో ఆమె అందంగా ఉండడంతో సినీ జనం రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే స్టార్ హీరోయిన్ అవడం ఖాయం అని కీర్తిస్తున్నారు. అయితే దివ్య సత్యరాజ్ కు మాత్రం సినిమాల కన్న రాజకీయాలంటే బాగా ఇష్టమట.. త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.