https://oktelugu.com/

Tollywood : చిన్నప్పుడు తను నవ్వి.. ఇప్పుడు అందరినీ నవ్విస్తున్న ఈ కుర్రాడి గురించి తెలుసా?

Tollywood దీని కింద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పుడు తను నవ్వి.. ఇప్పుడు అందరినీ నవ్విస్తున్నాడంటూ కొందరు మెసేజ్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 24, 2024 / 01:31 PM IST

    Sudigali Sudheer

    Follow us on

    Tollywood : సోషల్ మీడియా పుణ్యమాని కొన్ని పాత ఫొటోలు అన్ని బయటపడుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలను తమ ఖాతాలో పోస్టు చేయగా.. వాటిని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ చిన్న నాటి పిక్స్ ను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ హీరోకు సంబంధించిన చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పుడు ఎంతో సంతోషవంగా కనిపిస్తున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు తన కామెడీతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. మరోవైపు మాస్ హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడో ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే కిందికి వెళ్లండి..

    జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ ప్రొగ్రాంలో నటించిన వారు ఇప్పుడు మంచి స్టార్ నటులుగా కొనసాగుతున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ ఒకరు. తనదైన కామెడీతో నవ్వుల పంట పండించిన సుధీర్ తన టీంతో జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా యాంకర్ రష్మికతో కెమెస్ట్రీ పండించి యూత్ ను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వెండితెరపై కొనసాగుతూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

    జబర్దస్త్ కు ముందు ‘పోవే..పోరా’ అనే కార్యక్రమం ద్వారా యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తరువాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత గుర్తింపు వచ్చింది. అయితే జబర్దస్త్ లో కొనాసాగుతూనే కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ గా నటించారు సుధీర్. ఆ తరువాత హీరోగా మారిపోయాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా మారిన ఈయన ఆ తరువాత ‘ త్రీ మంకీస్’, ‘గాలోడు’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘గోట్’ అనే మూవీతో రానున్నారు.

    అయితే సుధీర్ కు సంబంధించి చిన్న నాటి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కుర్రాడు చక్కటి స్మైల్ ఇస్తున్నాడు. ఈ పిక్ ను సుధీర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దీని కింద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చిన్నప్పుడు తను నవ్వి.. ఇప్పుడు అందరినీ నవ్విస్తున్నాడంటూ కొందరు మెసేజ్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.