https://oktelugu.com/

Sam-chai: సామ్-చై విడాకులతో నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్..!

Sam-chai crazy project: అక్కినేని నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. వీరి వైవాహిక జీవితం కొన్నాళ్లపాటు సాఫీగా సాగింది. అయితే ఉన్నట్లుండి వీరిద్దరు విడాకులు తీసుకోవడంఅందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం వీరిద్దరు సినిమాలపై ఫోకస్ పెడుతూ బీజీ బీజీగా గడుపుతున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య కెరీర్ సూపర్ గా దూసుకెళుతోంది. రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’తో సూపర్ హిట్టు అందుకున్నారు. ఈ సంక్రాంతిగా తన తండ్రి నాగార్జునతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 7, 2022 / 10:20 AM IST
    Follow us on

    Sam-chai crazy project: అక్కినేని నాగచైతన్య-సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. వీరి వైవాహిక జీవితం కొన్నాళ్లపాటు సాఫీగా సాగింది. అయితే ఉన్నట్లుండి వీరిద్దరు విడాకులు తీసుకోవడంఅందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం వీరిద్దరు సినిమాలపై ఫోకస్ పెడుతూ బీజీ బీజీగా గడుపుతున్నారు.

    Naga Chaitanya Samantha

    విడాకుల తర్వాత నాగచైతన్య కెరీర్ సూపర్ గా దూసుకెళుతోంది. రీసెంట్ గా ‘లవ్ స్టోరీ’తో సూపర్ హిట్టు అందుకున్నారు. ఈ సంక్రాంతిగా తన తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’గా థియేటర్లలో సందడి చేస్తున్నాడు. అదేవిధంగా సమంత సైతం జెడ్ స్పీడుతో ముందుకు దూసుకెళుతోంది. ‘పుష్ప’లో ఓ స్పెషల్ సాంగ్ చేసి యూత్ అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకుంది.

    టాలీవుడ్, కోలీవుడ్ తోపాటు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఓ హాలీవుడ్ సినిమాలోనూ సమంత నటిస్తుండటం విశేషం. ఒకవైపు సినిమాలు చేస్తూ మరో వెబ్ సిరీసులు చేస్తూ తీరికలేకుండా గడుపుతోంది. ఇక వీరిద్దరు విడిపోవడంతో ఓ క్రేజ్ ప్రాజెక్టు నిలిచిపోయిందని టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది.

    ‘మజిలీ’ మూవీని డైరెక్టర్ నందిని రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. నాడు రియల్ కఫుల్ గా ఉన్న సమంత-చైతన్య ఈ మూవీలోనూ భార్యభర్తలుగా నటించి ఆ సినిమాకు ప్రాణం పోశారు. ఈ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కించాలని నందిని రెడ్డి భావించారు. ఈ ప్రాజెక్టుకు అప్పట్లో సమంత, చైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

    ప్రస్తుతం ఈ జంట విడిపోవడంతో ఆ క్రేజీ ప్రాజెక్టు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీరిద్దరు కూడా ఎవరికీ వారు సినిమాలు చేస్తూ బీజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రాకముందే కనుమరుగైందనే టాక్ విన్పిస్తోంది. ఇదిలా ఉంటే నందిని రెడ్డి ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా ఒక మూవీని డైరెక్ట్ చేస్తోంది.