Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’. ఈ చిత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి మహేశ్ సినీ కెరీర్ లో నే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేశారు. ఈ పిక్చర్ లోని యాక్షన్ సీక్వెన్సెస్, మహేశ్, భూమిక, ప్రకాశ్ రాజ్ ల మధ్య సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఎపిసోడ్ కూడా చాలా ఆకట్టుకుంటుంది. కాగా, ఆ సీన్ లో ధర్మ వరపు తన ఫోన్ నెంబర్ 98480 32919 అని చెప్తుంటాడు. ఆ నెంబర్ ఎవరిది? ఆ సీన్ లో ఆ నెంబరే ఎందుకు పెట్టారు? ఆ విషయమై డైరెక్టర్ ఏం ఆలోచించాడు ? అనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా స్టోరిలో భాగంగా మహేశ్ బాబు భూమికను విదేశాలకు పంపించాలనుకున్నాడు. అలా పాస్ పోర్టు ఆఫీసర్ గా ఉన్న ధర్మవరపు సుబ్రమణ్యం దగ్గరి నుంచి పాస్ పోర్టు తీసుకునేందుకుగాను వెళ్తాడు. అయితే, పాస్ పోర్టు పోస్టులో వస్తుందని చెప్తాడు. ఈ క్రమంలోనే తాను బిజీగా ఉన్నానని అంటాడు. తన భార్య సావిత్రిని కాదని తన ఫోన్ నెంబర్ గర్ల్ ఫ్రెండ్ కు చెప్తాడు. ఆ నెంబర్ 98480 32919.
Also Read: తరచూ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే!
ఈ సీన్ చైసే టైంలో ఫోన్ నెంబర్ ఎవరిది బాగుంటుంది? అని ఆలోచించుకుంటున్న క్రమంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రొడ్యూసర్ ది అయితే బాగుంటుందని సలహా ఇచ్చారు. దాంతో ఇక ప్రొడ్యూసర్ నెంబర్ పెట్టేశారు. పిక్చర్ లో ఈ సీన్ బాగానే పేలింది. ఇక ఈ నెంబర్ కు ఫోన్ చేసి మహేశ్ బాబు, అతని స్నేహితులు విసిగిస్తారు.
ఈ క్రమంలోనే మెల్లగా పాస్ పోర్టు ఆఫీసర్ గా ఉన్న ధర్మవరపు సుబ్రమణ్యం దగ్గరి నుంచి పాస్ పోర్టు తీసుకుంటారు. ఈ సంగతులు అటుంచితే.. సినిమా విడుదలయ్యాక చాలా మంది అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ నెంబర్ కు ఫోన్ చేశారట. దాంతో ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కొద్ది రోజులకే ఫోన్ నెంబర్ మార్చేశాడట. చాలా మంది ఆ టైంలో ఈ నెంబర్ అసలు రింగ్ అవుతుందా? లేదా ? అని ప్రతీ రోజు ట్రై చేసేవారట.