Mudragada Padmanabham: ముందొచ్చే చెవులకంటే వెనకొచ్చే కొమ్ములకే వాడి అనేది సామెత. కాపు సామాజిక వర్గం కోసం ఎంతో కష్టపడిన ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం ఒంటరైపోయారు. సర్వస్వం ధారపోసి ఉద్యమం నడిపిన వ్యక్తిని ప్రస్తుతం పక్కన పెట్టేశారు. రాజకీయ చదరంగంలో పావుగా వాడుకున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన చేసిన త్యాగం ఎప్పటికి మరువలేనిది. కానీ ఆయన ఇప్పుడు కాపులకు శత్రువులా మారారు. ఆయనను పక్కన పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇంత చేసినా తనకు ఇచ్చిన గౌరవం ఇదేనా అని మథనపడుతున్నారు.
సొంత కులంలోనే వేరు కుంపట్లు రగులుకుంటున్నాయి. ఇన్నాళ్లు ముద్రగడతోనే కాపులకు గుర్తింపు వచ్చినా ప్రస్తుతం ఆయన సేవలను పక్కనపెడుతున్నారు. అప్పట్లో ఆయన మంత్రిపదవిని సైతం వదులుకున్నారు. కాపుల రిజర్వేషన్ల కోసం దీక్ష చేసిన సమయంలో జరగిన తుని సంఘటనతో అల్లర్లు రేగిన సంగతి తెలిసిందే. అప్పుడే రైలును తగులబెట్టిన నేపథ్యంలో ఉద్యమం పక్కదారి పట్టిందనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రభుత్వం అందరిపై కేసులు నమోదు చేసినా ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఎత్తేయడం అందరిలో హర్షం వ్యక్తమైంది.
Also Read: తరచూ ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. పాటించాల్సిన వాస్తు చిట్కాలు ఇవే!
కానీ ముద్రగడ జగన్ ను కలిసేందుకు సైతం భయపడాల్సి వస్తోంది. ఇందులో కూడా ఏదో రాజకీయం ఉందని ప్రచారం చేస్తారని భయపడుతున్నారు. కాపులకు అండగా నిలిచి వారికి మార్గనిర్దేశం చేసిన వ్యక్తికే ప్రస్తుతం తిప్పలు ఎదురవుతున్నాయి. కాపులను కాపాడిన నాయకుడికే కాలం కలిసి రావడం లేదు. ఫలితంగా మరో కాపు సంఘం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముద్రగడను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆయనలో భయం పట్టుకుంది.
ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ముద్రగడకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. మొత్తానికి కాపు సామాజిక వర్గానికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన నేతనే కాదనడం క్షమించరాని నేరంగా భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ఏం నేరం చేశారని దూరం పెడుతున్నారో తెలియడం లేదు. కానీ కాపుల ఉనికిని లోకానికి చాటిచెప్పింది మాత్రం ముద్రగడే అన్న సంగతి అందరు గుర్తించడం లేదని తెలుస్తోంది.