
దేశంలో కరోనా వ్యాప్తి సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఆంశంపై నిన్న విచారణ ప్రారంభం కాగా సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్రం తన అభిప్రాయం తెలియజేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 27 కి వాయిదా వేసింది. అటు ఈ విచారణలో అమికస్ క్యూరీ ( కోర్టు సహాయకుడు) గా సీనియర్ అడ్వోకేట్ హరీష్ సాల్వేను నియమించింది. అయితే హరీష్ సాల్వే నియామకం దుమారం రేపింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే అమికస్ క్యూరీగా స్వచ్ఛందంగా తప్పుకుంటున్కనట్లు నేడు ప్రకటించారు. తనకు సీజేఐ ఎస్ ఏ బోబ్డేతో చిరకాలంగా సాన్నిహిత్యం ఉందని పాఠశాల కాలేజీ రోజుల నుంచి ఒకరి కొకరం తెలుసుని హరీశ్ సాల్వే వెల్లడించారు.