దర్శక ధీరుడు రాజమౌళిని కరోనా భయపెడుతుంది. నిజానికి గత సీజన్ లోనే రాజమౌళి కరోనాను సమర్ధవంతంగా జయించారు. అయినా కరోనా మాత్రం ఆయనను ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది. వందల కోట్ల రూపాయిల మార్కెట్ ఉన్న “ఆర్ఆర్ఆర్” సినిమా ఇప్పటికే లేట్ అయింది. జక్కన్నకి ఇది పెద్ద సమస్యగా మారింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో కరోనా ప్రభావంలో కూడా షూటింగ్ ను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే యూనిట్ లో కరోనా వచ్చినా.. రాజమౌళి షూటింగ్ కి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. కానీ, ప్రస్తుతం ఇవ్వక తప్పలేదు. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ ఇలా ఎంతకీ ఎండ్ అవట్లేదనే నిరాశలో ఉంది చిత్రయూనిట్.
ఇప్పటికే అనుకున్న బడ్జెట్ ను దాటేసింది, కేవలం కరోనా కారణంగా. ఆ మాటకొస్తే.. కరోనా రాకముందు నుండే ఈ సినిమాకి ఎప్పుడూ ఏదొక ఆటంకం ఎదురవుతూనే ఉంది. దానికితగ్గట్టు లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ తో ఏడాది పోయింది. ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు ఎక్కువయిపోతున్నాయి. అయితే షూట్ స్టార్ట్ చేయటానికి ప్లాన్ చేస్తోన్న ప్రతిసారి యూనిట్ కి సంబధించిన ఎవరో ఒకరు కరోనా భారిన పడుతున్నారు. లాస్ట్ టైం షూట్ స్టార్ చేసే సమయంలో అలియా భట్ కరోనా బారిన పడింది. అంతకు ముందు సినిమా ప్రొడక్షన్ టీంలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అప్పుడు షూటింగ్ ఆపారు. దానికంటే ముందు రాజమౌళి ఫ్యామిలీకే కరోనా వచ్చింది, అప్పుడూ షూటింగ్ ను ఆపాల్సి వచ్చింది.
ప్రస్తుతం షూటింగ్ ని నిలిపివేశారు. కారణం రామ్ చరణ్ ఐసోలేషన్ లో ఉన్నాడని, చరణ్ – ఎన్టీఆర్ పై కొన్ని సీన్స్ తీయాలని జక్కన్న సన్నద్ధం అవుతూ ఉండగా.. చరణ్ డ్రైవర్ కరోనాతో చనిపోయాడు. ఇక తప్పక చరణ్ కూడా ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది. మరోపక్క షూటింగ్ చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరి ఈ లెక్కన ఈ సినిమా షూటింగ్ ను ఇక ఎప్పుడు పూర్తి చెయ్యాలి ? అన్నిటికి మించి సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 13కి మరెంతో సమయం కూడా లేదు. అప్పటిలోపు సినిమాని పూర్తి చేసి సినిమాని విడుదల చేయగలమా? అంటూ రాజమౌళి టెన్షన్ కి గురి అవుతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ రెండున్నరేళ్ళకు పైగా ఈ సినిమా కోసం పని చేశారు.