Reason for late sunset today: మారుతున్న వాతావరణల ఆధారంగానే భూమ్మీద మనుషుల మనుగడ, ఇతర జీవుల మనుగడ కొనసాగుతూ ఉంటుంది. ఉదయం పూట ఉష్ణోగ్రత ఒక విధంగా ఉంటుంది. మధ్యాహ్నం పూట మరో విధంగా ఉంటుంది. సాయంత్రం పూట ఉష్ణోగ్రత తగ్గుతుంది. రాత్రిపూట మరింత పడిపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనులను భూమి మీద ఉన్న జీవులు సాగిస్తుంటాయి. మనుగడ కోసం చేసే పోరాటంలో అనేక క్రతువులకు పాల్పడుతుంటాయి. ఈ వాతావరణంలో ఏర్పడే మార్పుల ఆధారంగానే సూర్య రశ్మి, భారీ లేదా స్వల్ప ఉష్ణోగ్రత, వర్షపాతం, హిమపాతం వంటివి చోటు చేసుకుంటాయి. భూమిలో ఏర్పడే మార్పుల వల్ల భూకంపాలు.. సముద్రాలలో చోటు చేసుకునే మార్పుల వల్ల సునామీలు.. పర్వతాలలో చోటు చేసుకునే మార్పుల వల్ల లావా బయటికి రావడం వంటి పరిణామాలు ఏర్పడుతుంటాయి. ఇవి మాత్రమే కాదు భూమి సూర్యుడి చుట్టూ తిరిగే వేగం ఆధారంగానే ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి వంటివి ఏర్పడుతుంటాయి. సాధారణంగా శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుంది. సూర్యోదయం కూడా ఆలస్యంగా అవుతుంది. ఇక వేసవికాలంలో అయితే సూర్యోదయం త్వరగా అవుతుంది. సూర్యాస్తమయం కాస్త ఆలస్యంగా చోటు చేసుకుంటుంది.
ఇక ప్రస్తుతం భారతదేశంలో వర్షాకాలం కొనసాగుతోంది. రుతుపవనాలు విస్తరించి అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నేడు జూన్ 21 సందర్భంగా.. త్వరగా చీకటి పడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు పగలు ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం లేకపోలేదు ఉత్తరార్థ గోళంలో ఉన్న మనకు ఈ ఏడాదిలో అత్యంత పొడవైన పగలు ఉండేది ఈరోజే. దీనిని ఆయనాంతం అని పిలుస్తారు. సూర్యుడు కర్కాటక రాశిలో అత్యధిక ఉత్తరాయణానికి ఈరోజు చేరుకుంటాడు. అందువల్లే సూర్యుడి కిరణాలు భూమిమీద ప్రత్యక్ష కోణంలో పడుతుంటాయి. దీనివల్ల వెలుతురు ఎక్కువసేపు ఉంటుంది. ఇక సాయంత్రం ఆలస్యంగా చీకటి అవుతుంది. ఇక డిసెంబర్ 23న అత్యంత సుదీర్ఘమైన రాత్రి ఉంటుంది. ఆరోజు సూర్యుడి కిరణాలు భూమి మీద పరోక్షంగా పడుతుంటాయి. అందువల్ల వెలుతురు త్వరగానే తగ్గిపోతుంది. ఆరోజు రాత్రి అత్యంత సుదీర్ఘంగా ఉంటుంది. జూన్ 21న సూర్యుడి కిరణాలు భూమి మీద ప్రత్యక్షంగా పడటం వల్ల చీకటి ఆలస్యంగా అవుతుంది. అందువల్లే రాత్రి సమయం త్వరగా గడిచిపోతుంది.. అయితే మరుసటి రోజు సూర్యోదయం అయ్యే విషయంలో ఏమాత్రం మార్పు ఉండదు. ఇక మిగతా సమయంలో కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకోవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.