Prabhas Heroine: హీరోయిన్ గా కృతి సనన్ ఎంత సంపాదిస్తుంది ? ఆమెకు హీరోయిన్ గా గొప్ప సంపాదన ఏమి లేదే ? మరి నెలకు అక్షరాలా 10 లక్షల రూపాయల రెంట్ ఎలా కడుతుంది ? అంటే.. ఆమెకు వేరే సంపాదనలు ఏమైనా ఉన్నాయేమో ?… హిందీ సోషల్ మీడియాలో ఇలా చర్చలు సాగుతున్నాయి. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి చెందిన ఒక అపార్ట్మెంట్ ని కృతి సనన్ రెంట్ కి తీసుకొంది.

అయితే, ఆ అపార్ట్మెంట్ కి నెలకు పది లక్షల రూపాయలు రెంట్. అంటే.. ఏడాదికి కోటి ఇరవై లక్షలు. ఇక మెయింటెనెన్స్, వర్కర్స్ శాలరీస్ ఇలా మొత్తం కలుపుకొని లెక్కలు వేసుకుంటే.. మరో ముప్పై లక్షలు అవుతుంది. అంటే.. కేవలం ఉండటానికి కృతి సనన్ ఏడాదికి కోటి యాభై లక్షలు ఖర్చు పెడుతుంది. ఒక అద్దె ఇంటికి ఈ స్థాయి రెంట్ స్టార్ హీరోలు కూడా కట్టడం లేదు.
Also Read: కసితో హిట్ కొట్టాడు.. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు !
మరి ఈ బ్యూటీ ఎందుకు అంత ఖర్చు పెడుతుంది ? ఇప్పుడు ఇదే హిందీలో హాట్ టాపిక్ అయింది. పైగా కృతి సనన్ ఏరికోరి అమితాబ్ ప్లాట్ లోనే రెంట్ కి దిగింది. అమితాబ్ కి ముంబైలో అనేక ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని రెంట్ కి ఇచ్చి, బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. ఎలాగూ కొడుకు అభిషేక్ కి సంపాదన లేదు. దాంతో అమితాబ్, ఆయన కోడలు ఐశ్వర్యరాయ్ సంపాదన మీద పడ్డారు.
సరే.. అమితాబ్ విషయాన్ని పక్కన పెడితే.. అసలు కృతి సనన్ కి అన్నీ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి ? ఆమె స్టార్ హీరోయిన్ కూడా కాదు. పైగా ఆమె సినిమాలు కూడా భారీగా పెద్ద స్థాయిలో ఏమి చేయలేదు. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో మాత్రమే నటిస్తోంది. అయినా నెలకు 10 లక్షలు ఆమెకి పెద్ద లెక్క కాదు అని అంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ ఆమెకు సంపాదన ఎక్కడ నుంచి వస్తోందో !!