Post Office Schemes: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి జీవితం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. అనుకోకుండా ఏ సమయంలో అయినా ఏమైనా జరగొచ్చు. ఒకవేళ ఆ విధంగా అనుకోకుండా పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాదారుడు అనుకోకుండా మరణించినట్లయితే ఆ ఖాతాదారుడు తన ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బులను ఎలా విత్డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఖాతాదారుడికి నామిని ఉన్నట్లయితే ఆ ప్రక్రియ ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడుకి నామిని లేకపోతే ఆ ప్రక్రియ మరొక విధంగా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లో ఖాతాదారుడు లేదా పోస్ట్ ఆఫీస్ సర్టిఫికేట్ హోల్డర్ అకస్మాత్తుగా మరణించినట్లయితే అతను తన పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బును అతను ఇచ్చిన నామినీకి, చట్టపరమైన వారసుడికి లేదా ఏదైనా ఇతర అర్హత ఉన్నా వ్యక్తి కి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఖాతాదారుడికి నామిని నియమించబడ్డారా లేదా అనే దానిపై ఈ ప్రక్రియ మొత్తం ఆధారపడి ఉంటుంది అని చెప్పొచ్చు.
పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఖాతాదారుడికి నామినీ ఉన్నట్లయితే ఈ ప్రక్రియ మొత్తం చాలా ఈజీగా పూర్తి అవుతుంది. ఆ నామినీ సులభంగా డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. వీళ్లకు వీలునామా లేదా వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటివి చటపరమైన ఆధారాలు ఉండాలి. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఖాతాదారుడికి నామినీ లేకపోతే ఆరు నెలల కాలం తర్వాత అఫిడవిట్ లేదా పరిహారానికి సంబంధించిన పత్రాలు అందించాల్సి ఉంటుంది. వారసత్వ ధ్రువీకరణ పత్రం కూడా తప్పనిసరిగా అందించాలి. పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడికి నామినీ ఉన్నట్లయితే అతను పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీసర్ పొదుపు పథకం కోసం ఫారం ఎస్ బి 84 తో పాటు నామినీకి ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం అలాగే నామిని ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా రుజువు మరియు ఇటీవలి ఛాయాచిత్రం కూడా అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మరణించిన ఖాతాదారుడు వీలునామా ముందుగానే రాసిపెట్టినట్లయితే దాని ఆధారంగా కూడా డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు. దీనికి మీకు క్లెయిమ్ ఫారం తో పాటు ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం అసలు, జిరాక్స్ కాపీ అలాగే చట్టపరమైన ఆధారాలు, వీలునామా రుజువు, వారసత్వ ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. ఈ పత్రాలన్నీ సమర్పించిన తర్వాత చట్టపరమైన వారసుడు డబ్బును క్లైమ్ చేసుకోవచ్చు.