Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రోజురోజుకి ఎన్ని మలుపులు తీసుకుంటుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ అల్లు అర్జున్ పై, తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ లో ప్రకంపనలు రేపాయి. అల్లు అర్జున్ కూడా దీనికి స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ మరుసటి రోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి పై దాడి చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ కోర్టు రూల్స్ ని ధిక్కరిస్తూ, ముద్దాయి అయినప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం పై పోలీసులు త్వరలో అల్లు అర్జున్ బెయిల్ రద్దు పై పిటీషన్ వేయబోతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కి హైదరాబాద్ పోలీసులు రేపు పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసారు. సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటనపై ఆయన్ని విచారణ కోసం పిలుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ రేపు ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇవన్నీ మీడియా కి అందిస్తున్నది ఎవరు?, అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తున్నదని ముందస్తు సమాచారం అందడం వల్లే కదా, తొక్కిసిలాట ఘటన జరిగింది. ఇప్పుడు మీడియా కి బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తే, రేపు పోలీస్ స్టేషన్ వద్ద అల్లు అర్జున్ అభిమానులు భారీ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంటుంది కదా. అప్పుడు మాత్రం తొక్కిసిలాట ఘటనలు జరగవా?, గోప్యంగా ఉండాల్సిన ఈ సమాచారాలను ఎవరు మీడియా కి లీక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన మరో అంశం.
ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ కి ఇచ్చిన ఇంటెర్మ్ బెయిల్ గడువు వచ్చే నెల 12 వ తారీఖుతో ముగియబోతుంది. సాధారణ బెయిల్ అల్లు అర్జున్ కి వస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసిన అంశం. అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం చాలా గట్టిగ ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన తనకి ఉన్న సర్కిల్ ని ఉపయోగించుకొని అల్లు అర్జున్ వ్యవహారం పై రాజీ కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన ఎంత వరకు సఫలం అవుతారో చూడాలి. మరోపక్క శ్రీ తేజ్ తండ్రికి నేడు పుష్ప నిర్మాతలు 50 లక్షల రూపాయిల చెక్ ని అందించిన సంగతి తెలిసిందే.