https://oktelugu.com/

Shyam Benegal : బాలీవుడ్ లో గొప్ప సినిమాలను తీసిన దిగ్గజ దర్శకుడు మృతి…

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలావరకు ప్రయత్నిస్తుంటారు. కానీ మామూలు హీరోలను స్టార్లుగా మార్చడంలో దర్శకుడు ఎంతలా కష్టపడ్డాడు అనేది ఎవ్వరు పట్టించుకోరు...ముఖ్యంగా అభిమానులు కూడా హీరోలనే ఆరాధిస్తూ ఉంటారు తప్ప దర్శకుడి గురించి మాట్లాడుకునే సమయం వాళ్లకు ఉండదనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : December 23, 2024 / 10:00 PM IST

    Shyam Benegal passes Away

    Follow us on

    Shyam Benegal : సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒకప్పుడు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి వాళ్ళని స్టార్లుగా మార్చడానికి కొంతమంది దర్శకులు, రచయితలు విపరీతమైన కష్టాలను పడుతూ మంచి కథలను సినిమాలుగా చేసి సూపర్ సక్సెస్ లను అందుకొని మామూలు నటులను స్టార్ హీరోలుగా తయారు చేశారు. మరి ఏది ఏమైనా కూడా స్క్రీన్ మీద కనిపించే హీరోకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్లు మాత్రమే జనాలకు తెలుస్తూ ఉంటారు. తెర వెనుక ఉండే దర్శకుడు, రచయిత గురించి ఎవరికి తెలియదు… ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ‘శ్యామ్ బెనగల్’ గురించి మనం ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు…ఎన్నో గొప్ప సినిమాలను తిది బాలీవుడ్ ఇండస్ట్రీ ని టాప్ లెవల్ కి తీసుకెళ్ళాడు… ఇక ఇదిలా ఉంటే ఈరోజు ఆయన తన తుది శ్వాసను విడిచారు. 90 సంవత్సరాల వయసు గల ఈయన గత కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన కొద్ది సేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్టుగా వైద్యులు ప్రకటించారు. 1934 డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్ లోని తిరుమలగిరి ప్రాంతం లో జన్మించిన ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా గొప్ప సినిమాలను తీసి మంచి దర్శకుడి గా గుర్తింపును సంపాదించుకున్నాడు.

    ఇక హైదరాబాద్ లో జన్మించి బాలీవుడ్ లో డైరెక్టర్ గా రాణించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలడంతో పాటు బాలీవుడ్ హీరోలకి చాలా మంచి గుర్తింపును సంపాదించి పెట్టాడనే చెప్పాలి. ఇక ఆయన చేసిన సినిమాల్లో అంకూర్, భూమిక, కలియుగ్, నిశాంత్, మంతన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి.

    ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన తన తుది శ్వాసను విడవడం అనేది సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసే విషయమనే చెప్పాలి. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మంచి సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో ఈయన లాంటి గొప్ప దర్శకుడు మరణించాడు అనే వార్త యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసిందనే చెప్పాలి.

    ఇక ఇప్పటికే ఈయన మరణం పట్ల చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి సినిమాలను తీసి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడం అనేది దురదూష్టకరమనే చెప్పాలి.