Personal loan VS credit card loan: ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఏ చిన్న పని కోసం అయినా డబ్బు కావాల్సిందే. అయితే అవసరాలు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. కానీ ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు వ్యక్తుల దగ్గర వడ్డీకి అప్పులు తీసుకునేవారు. కానీ ఇప్పుడు బ్యాంకులు తక్కువ వాటితో రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ రుణాలు రకరకాలుగా ఉంటున్నాయి. వీటిలో వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ పై రుణాలు ఉంటాయి. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఈ రెండింటిలో ఏ లోన్ మంచిది? ఏదీ తక్కువ వడ్డీ ఉంటుంది? మరి ఈ రెండింటిలో ఉన్న తేడాలు ఏంటో చూద్దాం..
ఒక బ్యాంకు ఒక వ్యక్తికి కొన్ని ధృవపత్రాలను ఆధారంగా చేసుకొని ఇచ్చే రుణాన్ని వ్యక్తిగత రుణం అంటారు. ఈ రుణం మంజూరు చేయడానికి కాస్త సమయం పడుతుంది. సరైన ధ్రువపత్రాలు లేకపోతే ఒక్కోసారి రుణం మంజూరు కాకపోవచ్చు. అయితే ఈ రుణం పై వడ్డీ రేటు 10.5% ఉంటుంది. దీర్ఘకాలిక అవసరాలకు, వివాహాది శుభకార్యాలకు, పిల్లల ఉన్నత చదువుల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు.
Read Also: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇక బ్యాంకు లోన్ లన్నీ కారు చౌక
ఒక వ్యక్తికి ఉన్న క్రెడిట్ కార్డు పై ఇచ్చే రుణం మరో విధంగా ఉంటుంది. అంటే ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ లో కొంతవరకు బ్లాక్ చేసి ఆ మొత్తాన్ని ముందు అవసరాల కోసం లోన్ రూపంలో ఇస్తారు. ఈ రుణం ఆన్లైన్లో తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి ధృవపత్రాలు అవసరం ఉండదు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పై ఉన్న సమాచారమే వారికి ఆధారం. ఈ క్రెడిట్ కార్డు ఎలాగో బ్యాంకుతో లింక్ అయి ఉంటుంది. దీంతో వారు వాటిని ఆధారంగా చేసుకొని లోన్ మంజూరు చేస్తారు. అయితే క్రెడిట్ కార్డ్ పై తీసుకొని రుణం వడ్డీ శాతం ఎక్కువగానే ఉంటుంది. ఇది వారి క్రెడిట్ స్కోర్ ని బట్టి నిర్ణయించబడుతుంది. సాధారణంగా ఈ రుణంపై వడ్డీ రేటు 11% శాతం ఉండొచ్చు.
అయితే వ్యక్తిగత రుణానికి, క్రెడిట్ కార్డు పై తీసుకుని రుణానికి చాలా తేడా ఉంటుంది. ఇవి రెండు దాదాపు ఓకే రకమైన వడ్డీ రేటును విధించినా కొన్ని విషయాల్లో మాత్రం తేడాలు ఉంటాయి. అత్యవసరానికి క్రెడిట్ కార్డు పై తీసుకునే రుణం ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఆసుపత్రి ఖర్చులకోసం డబ్బు అవసరము పడితే ఆ సమయానికి ఇతరుల వద్ద ఉండకపోవచ్చు. దీంతో ఆన్లైన్లో ఈ క్రెడిట్ కార్డు పై ఉన్న లిమిట్లో రుణం తీసుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక అవసరాలకు ఇది పనిచేయదు. ఎందుకంటే దీర్ఘకాలిక అవసరాల కోసం తీసుకునే రుణంపై కాస్త వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకోసం వ్యక్తిగత రుణమే బెటర్ అని అనుకోవాలి.
వ్యక్తిగత రుణం తీసుకున్న వారు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు ఈఎంఐ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డు పై రుణం తీసుకునే వారికి ఏడాది నుంచి రెండు సంవత్సరాల పాటు గడువు ఉంటుంది. రెండు రుణాల్లో కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలు ఉన్నప్పటికీ వ్యక్తుల అవసరాలను బట్టి ఆయా రుణాలను తీసుకోవాలి. అంతేకాకుండా ఏ రుణం తీసుకున్న ఈఎంఐ మిస్ చేయకుండా ఉండాలి. అలా చేస్తే సిబిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం పడుతుంది.