https://oktelugu.com/

NPS Scheme: ఉద్యోగం లేకపోయినా సులువుగా పెన్షన్ ను పొందే అవకాశం.. ఎలా అంటే?

NPS Scheme: మనలో చాలామంది భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటారు. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని భావించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పొదుపు చేయాలని భావించే వాళ్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలను సులువుగా అధిమగించే అవకాశం అయితే ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ రిటైర్‌మెంట్ తరువాత మెరుగైన ఆర్థిక భద్రత […]

Written By: Kusuma Aggunna, Updated On : December 3, 2021 2:27 pm
Follow us on

NPS Scheme: మనలో చాలామంది భవిష్యత్తు గురించి ఆందోళన ఉంటారు. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని భావించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పొదుపు చేయాలని భావించే వాళ్లకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సమస్యలను సులువుగా అధిమగించే అవకాశం అయితే ఉంది.

NPS Scheme

NPS Scheme

నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ రిటైర్‌మెంట్ తరువాత మెరుగైన ఆర్థిక భద్రత అందించే స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ ద్వారా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులు రెగ్యులర్ ఇన్‌క‌మ్ పొందే ఛాన్స్ ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ పెన్షన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, పించను నిధి నియంత్రణ ఈ స్కీమ్ ను నియంత్రిస్తాయి.
Also Read: ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వడ్డీ.. ఎలా అంటే?

ఈ స్కీమ్ లో ప్రాథమిక టయర్-i ఖాతా, ఐచ్చిక టయర్ –ii ఖాతా ఉంటాయి. ప్రాథమిక టయర్-i ఖాతాలో జమ చేసిన డబ్బులను 65 సంవత్సరాల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉండదు. టయర్ –ii ఖాతాలోని డబ్బులను మాత్రం ఎన్నిసార్లు అయినా విత్ డ్రా చేసి, మళ్లీ డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసేన డబ్బులకు నిర్ణీత వడ్డీ, రాబడి ఉండదు.

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 9 శాతం నుంచి 12 శాతం రాబడి లభిస్తుంది. బ్యాంకులో ఎన్.పీ.ఎస్ ఖాతా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

Also Read: కడప డీసీసీబీలో 75 ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?