https://oktelugu.com/

Boyfriend cheating: పెళ్లి చేసుకుంటానంటే అన్ని అర్పించిన ఇంటర్ బాలిక.. చివరికిలా..

Boyfriend cheating : ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక.. తెలిసీ తెలియని తనం.. పైగా నవయవ్వనపు వ్యామోహం.. ప్రేమ ఏదో ఆకర్షణ ఏదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఓ యువకుడు.. ప్రేమ పేరుతో వలవేశాడు. ఆకర్షించాడు. పడిపోయిన బాలిక ప్రేమపేరుతో అతడికి అన్నీ ఆర్పించింది. రెండేళ్లు ఆ యువకుడికి శారీరక సుఖం కూడా ఇచ్చింది. తీరా బాలిక ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు నిలదీయడంతో యువకుడిని ప్రేమిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటానన్నాడని తెలిపింది. చివరకు ప్రియుడిని కలిసి పెళ్లి […]

Written By: , Updated On : December 2, 2021 / 08:55 PM IST
Follow us on

Boyfriend cheating : ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక.. తెలిసీ తెలియని తనం.. పైగా నవయవ్వనపు వ్యామోహం.. ప్రేమ ఏదో ఆకర్షణ ఏదో తెలియదు. దాన్ని అవకాశంగా తీసుకున్నాడు ఓ యువకుడు.. ప్రేమ పేరుతో వలవేశాడు. ఆకర్షించాడు. పడిపోయిన బాలిక ప్రేమపేరుతో అతడికి అన్నీ ఆర్పించింది. రెండేళ్లు ఆ యువకుడికి శారీరక సుఖం కూడా ఇచ్చింది. తీరా బాలిక ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు నిలదీయడంతో యువకుడిని ప్రేమిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటానన్నాడని తెలిపింది. చివరకు ప్రియుడిని కలిసి పెళ్లి చేసుకోవాలని కోరితే అతడు నో చెప్పాడు. కేవలం ఎంజాయ్ వరకే పెళ్లి గిల్లీ లేదన్నాడు.చివరకు మోసపోయానని గ్రహించిన బాలిక చివరకు తనువు చాలించింది.

Boyfriend cheating

sucide-lady

ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని ఎర్రబోడు గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. మాణిక్యారం గ్రామ శివారులో రూప్ తండాకు చెందిన నునావత్ తారాచంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లపాటు శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. వీళ్ల ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు నిలదీశారు.

Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?

దీంతో తారాచంద్ ను ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని బాలిక తెలిపింది. ఈ విషయంపై ప్రియుడిని అడగగా అతడిని ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోనని తారాచంద్ చెప్పండంతో మనస్థాపానికి గురైన బాలిక నాలుగు రోజుల క్రితం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది పరిస్థితి విషమించి తాజాగా మృతిచెందింది.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు తారాచంద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను మోసం చేసిన తారాచంద్ ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళన చేశారు.

Also Read: ఆ విషయంలో ప్రతి ఒక్కరూ మనసు చెప్పింది వినాల్సిందే..?