Highway Movie: సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ… హైవే సినిమా నుంచి పోస్టర్ రిలీజ్

Highway Movie: దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై… మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు రౌడీ బాయ్ విజయ్​ దేవరకొండ తమ్ముడు ఆనంద్​ దేవరకొండ. ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఆనంద్ హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ  `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ ఈ […]

Written By: Sekhar Katiki, Updated On : December 3, 2021 8:32 am
Follow us on

Highway Movie: దొరసాని సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై… మిడిల్ క్లాస్​ మెలొడీస్​తో టాలీవుడ్​లో మంచి హిట్​ కొట్టాడు రౌడీ బాయ్ విజయ్​ దేవరకొండ తమ్ముడు ఆనంద్​ దేవరకొండ. ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యం సాధించారు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం ఆనంద్ హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ మూవీ  `హైవే`. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.  బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండడం మరో ప్రత్యేకత అని చెప్పాలి.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ‘‘ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే `హైవే’ . పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌. టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది` అన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో ప్రేక్శకులను అలరిస్తున్న ఆనంద్ మరి ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.