Nithiin
Nithiin: నితిన్ లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించాడు. హీరోయిన్ శ్రీలీల నితిన్ తో మరోసారి జతకడుతుంది. గతంలో వీరిద్దరూ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో జంటగా నటించారు. ఇక వెంకీ కుడుములతో సైతం నితిన్ కి ఇది రెండో చిత్రం. వీరి కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ కొట్టింది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. రాబిన్ హుడ్ లో సైతం రష్మిక నటించాల్సింది. అధికారిక ప్రకటన కూడా చేశారు. బిజీ షెడ్యూల్స్ కారణంగా రాబిన్ హుడ్ నుండి రష్మిక తప్పుకుంది.
Also Read: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!
కాగా రాబిన్ హుడ్ మార్చి 28న థియేటర్స్ లోకి రానుంది. విడుదల తేదీకి మూడు వారాల సమయం మాత్రమే ఉంది. హీరో నితిన్ కి చుక్కలు చూపిస్తున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ కి రావాలంటూ వెంటబడుతున్నాడు. చివరికి బెడ్ రూమ్, బాత్ రూమ్ లోకి కూడా దూరిపోతున్నాడు. నితిన్ ఎక్కడికెళ్లినా వెంటాడుతున్నాడు. వెంకీ టార్చర్ ని నితిన్ తట్టుకోలేకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
#Robinhood బానే ఫాలో అయ్యారు @VenkyKudumula ..mothaaniki pic.twitter.com/4Ah4RMqHnx
— devipriya (@sairaaj44) March 7, 2025
నిజానికి ఇది కూడా ప్రమోషన్స్ లో భాగమే. అనిల్ రావిపూడిని స్ఫూర్తిగా తీసుకున్న వెంకీ ఈ తరహా ప్రమోషనల్ వీడియోలు చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒకప్పటిలా సినిమా చేశామా? థియేటర్స్ లో విడుదల చేశామా? అంటే సరిపోదు. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి దర్శకుడు కూడా కృషి చేయాలి. రామ్ చరణ్, బాలకృష్ణలతో సంక్రాంతి బరిలో పోటీపడ్డాడు వెంకటేష్. మార్కెట్, స్టార్డం రీత్యా వెంకటేష్ ఒక మెట్టు కింద ఉన్నారు. దాంతో అనిల్ రావిపూడి వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేశాడు.
వెంకటేష్, ఐశ్యర్య రాజేష్, మీనాక్షి చౌదరిలను ప్రమోషన్స్ కోసం విపరీతంగా వాడేశాడు. చివరికి ఆయన కూడా వెంకటేష్ నటించిన జయం మనదేరా మూవీ గెటప్ వేశాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీపై హైప్ పెరగడానికి ఈ ప్రమోషనల్ వీడియోలు చాలా హెల్ప్ చేశాయి. అదే టెక్నీక్ ఫాలో అవుతున్న వెంకీ కుడుముల నితిన్ తో కలిసి ఒక ప్రమోషనల్ వీడియో చేశాడు. రాబిన్ హుడ్ టీమ్ సదరు వీడియో షేర్ చేసింది. సక్సెస్ కోసం తప్పదు మరి. రాబిన్ హుడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.
Also Read: బిగ్ బాస్ యష్మి పెళ్లి , వరుడు ఎవరు?… వైరల్ గా వేడుకల ఫోటోలు!