https://oktelugu.com/

Ruksana : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ రుక్సానా కి ఘోర అవమానం..కన్నీళ్లు పెట్టుకున్న యంగ్ హీరోయిన్!

Ruksana : కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram|) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'దిల్ రూబా'(Dilruba) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు.

Written By: , Updated On : March 7, 2025 / 01:14 PM IST
Ruksana

Ruksana

Follow us on

Ruksana : కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram|) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దిల్ రూబా'(Dilruba) ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు. ఈ ఈవెంట్ హీరో కిరణ్ అబ్బవరం, మూవీ టీం తో పాటు హీరోయిన్ కూడా పాల్గొన్నది. సాధారణంగా ఏ ఈవెంట్ లో అయినా మీడియా రిపోర్టర్స్ హీరోయిన్ ని ప్రత్యేకంగా ఫోటో షూట్ అడుగుతారు. అలా నిన్న రుక్సానా(Heroine Ruksana) ని కూడా ఫోటో షూట్ అడిగారు. కానీ ఆమె నాకు డ్రెస్ చాలా అసౌకర్యం ఉంది, నేను ఫోటో షూట్ ఇవ్వలేను అని చెప్పుకొచ్చింది. దీనికి మీడియా రిపోర్టర్స్ ఆమె పై అలిగారు. మూవీ టీం మొత్తం గ్రూప్ ఫోటో తీసుకోగా, అందులో రుక్సానా ని తొలగించారు.

Also Read : మాజీ ప్రియుడికి పెళ్లి చేసే ప్రేయసి.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ మూవీ స్టోరీ!

మాకు ఫోటో షూట్ ఇవ్వడానికి ఇబ్బంది అయినప్పుడు, గ్రూప్ ఫొటోలో మాత్రం మీరెందుకు?, అని ఆమె ఈవెంట్ లో ఎక్కడా కనిపించకుండా ఉండేలా ఫోటోలు తీసి అవమానించారట. దీనికి రుక్సానా చాలా ఫీల్ అయ్యింది. ఈవెంట్ చివర్లో ఆమె మైక్ అందుకొని ‘నన్ను ఇందాక ఫోటో షూట్ ఇవ్వమని అడిగారు. నేను చాలా వినమ్రతతో వేసుకున్న బట్టలు సౌకర్యంగా లేవు, నేను ఇవ్వలేను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పాను. అందులో ఏమైనా తప్పు ఉందా?, నేను అంత మర్యాదతో సమాధానం చెప్తే, ఒక రిపోర్టర్, అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు, నన్ను గ్రూప్ ఫోటో నుండి తప్పుకోమని చాలా యాటిట్యూడ్ తో చెప్పాడు. ఇది న్యాయమా?, నాకు సౌకర్యంగా లేకపోయినా కూడా వీళ్ళు కోరిన పని చెయ్యాలా?, లేకపోతే ఇలా అవమానిస్తారా?’ అంటూ ఆమె చాలా ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది. రుక్సార్ కి జరిగిన ఈ అవమానంపై నెటిజెన్స్ చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది విలేఖరులు వ్యవహరించే తీరు వల్ల, జర్నలిస్టులు అందరికి చెడ్డ పేరొస్తుంది. ఇలాంటోళ్లను అసలు ఈవెంట్స్ కి పిలవడం ఎప్పుడు మానేస్తారో, ఒక అమ్మాయిని ఇంతలా అవమానించాడు వాళ్లకు ఏ హక్కు ఉంది?, ఫోటో షూట్ ఇవ్వాలా లేదా అనేది ఆమె ఇష్టం, కానీ ఒక జర్నలిస్టుగా ఏ కార్యక్రమాలు చేయాలో, వాటికి అడ్డు చెప్తే ఎలా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇకపోతే ‘క’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం మరో సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతన్న సినిమా ఇది. తన జీవితం నుండి వెళ్లిపోయిన మాజీ ప్రేమికురాలు, మళ్ళీ అతని జీవితం లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అతని జీవితంలో ఉన్న అమ్మాయి తో ఉన్న విబేధాలను చెరిపివేసి, ఎలా వాళ్ళిద్దరిని ఒక్కటి చేసింది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. చూడాలి మరి ఈ కాన్సెప్ట్ ని ఆడియన్స్ ఎంత వరకు ఆదరిస్తారు అనేది.

Also Read : బైక్ గిఫ్ట్ గా ఇస్తా… హీరో కిరణ్ అబ్బవరం క్రేజీ ఆఫర్, ఇలా చేస్తే చాలు, అది మీ సొంతం!