Homeఎంటర్టైన్మెంట్Devara 2: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!

Devara 2: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!

Devara 2: ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ తో పాటు దేవర ప్రోమోలు, ఎన్టీఆర్ లుక్స్ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా దేవర థియేటర్స్ లోకి వచ్చింది. తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. దేవర మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ రోల్, యాక్షన్ ఎపిసోడ్స్, అనిరుధ్ మ్యూజిక్ కి మార్క్స్ పడ్డాయి. జాన్వీ కపూర్ కి స్క్రీన్ స్పేస్ లేకపోవడంతో పాటు దర్శకుడు కొరటాల శివ టేకింగ్ ఏమంత గొప్పగా లేదనే విమర్శలు వినిపించాయి.

Also Read: కింగ్ స్టన్ ఫుల్ మూవీ రివ్యూ…

కొరటాల కథను ఒక పార్ట్ లో చెబితే బాగుండేది. రెండు భాగాలుగా విడుదల చేయడం తప్పుడు నిర్ణయం అనే వాదన వినిపించింది. అయితే మిక్స్డ్ టాక్ తో కూడా దేవర భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక హిందీ వెర్షన్ పర్లేదు అనిపించింది. రూ. 60 కోట్ల వరకు వసూలు చేసింది. కొరటాల ప్రతిభపై సందేహాలు ఏర్పడిన నేపథ్యంలో దేవర 2 ఉంటుందా లేదా? అనే చర్చ మొదలైంది.

దేవర 2 చేసే ఆలోచన ఎన్టీఆర్ విరమించుకున్నాడనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే దేవర 2 ఉందని నిర్మాత కళ్యాణ్ రామ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. మార్చ్ 6న జాన్వీ కపూర్ జన్మదినం. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. అందమైన తంగంకి జన్మదిన శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. దేవర పోస్టర్ లో జాన్వీ కపూర్ లుక్ కట్టిపడేసింది. నోట్లో కత్తి, చేతిలో చేపతో జాన్వీ లుక్ విభిన్నంగా ఉంది. కాబట్టి డెన్వర్ 2 ఉందని, నిర్మాత కళ్యాణ్ రామ్ చెప్పకనే చెప్పాడని అంటున్నారు.

దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని సమాచారం. అయితే దేవర 2 సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నారు. ఇది స్ట్రెయిట్ హిందీ మూవీ. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకుడు. త్వరలో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కనుంది. 2026 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నారట. కాబట్టి దేవర 2 షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ఉండే అవకాశం కలదు.

 

Also Read:  సమంత క్రేజీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో మీర్జాపూర్ నటుడు… అంచనాలు పెంచేసిన అలీ ఫజల్ కామెంట్స్

Exit mobile version