Naga Chaitanya
Naga Chaitanya: బంగార్రాజు మూవీతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న నాగ చైతన్యకు రెండు డిజాస్టర్స్ పడ్డాయి. దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన థాంక్యూ ఆడలేదు. విక్రమ్ కే కుమార్ నుండి ఆ తరహా మూవీ ఆశించలేదు. అనంతరం కస్టడీ టైటిల్ తో థ్రిల్లర్ చేశాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీ సైతం ప్లాప్ అయ్యింది. ఈ క్రమంలో తన మిత్రుడు చందూ మొండేటితో చేతులు కలిపాడు. కార్తికేయ 2 మూవీతో భారీ హిట్ కొట్టిన చందూ మొండేటి వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ మూవీ చేశారు.
Also Read: దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!
నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటించింది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కిన తండేల్ చిత్రంలో నాగ చైతన్య జాలరి పాత్ర చేశాడు. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తండేల్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా తండేల్ రికార్డులకు ఎక్కింది. దేవిశ్రీ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. పరాజయాల నుండి గట్టెక్కించిన తండేల్ సక్సెస్ నాగ చైతన్యకు చాలా ప్రత్యేకం. ఈ సక్సెస్ ని భార్య శోభిత ధూళిపాళ్లతో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు నాగ చైతన్య. ఈ కొత్త జంట విదేశాల్లో విహరిస్తున్నారు. ఓ రెస్టారెంట్ లో తమకు ఇష్టమైన ఫుడ్ తింటూ కెమెరాకు ఫోజిచ్చారు. సదరు రొమాంటిక్ ఫోటో వైరల్ అవుతుంది.
గత ఏడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభితతో నాగ చైతన్య ఏడడుగులు వేశాడు. రెండేళ్లకు పైగా ఆమెతో నాగ చైతన్య రిలేషన్ లో ఉన్నాడు. విదేశాల్లో విహరిస్తున్న వీరి ఫోటోలు గతంలో లీక్ అయ్యాయి. నాగ చైతన్యతో ఎఫైర్ రూమర్స్ ని శోభిత కొట్టిపారేయడం విశేషం. 2024 ఆగస్టు నెలలో సడన్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. శోభితకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ నాగార్జున సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోలో నిరాడంబరంగా శోభిత-నాగ చైతన్యల వివాహం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలికి చెందిన శోభిత.. మోడల్ గా కెరీర్ ఆరంభించింది. బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె గూఢచారి 2లో నటిస్తున్నట్లు సమాచారం. వివాహం అనంతరం కూడా శోభిత నటన కొనసాగిస్తారా? ఫుల్ స్టాప్ పెడతారా? అనేది చూడాలి.
Also Read: సమంత క్రేజీ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్ లో మీర్జాపూర్ నటుడు… అంచనాలు పెంచేసిన అలీ ఫజల్ కామెంట్స్