Kangana: ఇటీవలే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ను పద్మశ్రీతో సత్మకరించిన సంగతి తెలిసిందే.మణికర్ణిక’, ‘పంగా’ సినిమాలలో ఆమె నటనకు గాను 2019 సంవత్సరానికి ఆ అవార్డును అందజేయడం జరిగింది. అలానే దివంగత సినీ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’ లో కంగనా… జయలలిత పాత్రలో నటించింది. అయితే, కాంట్రవర్సీకి మారుపేరుగా తెచ్చుకున్న కంగనాపై.. మరోసారి ట్రోల్స్ వర్షం కురుస్తోంది. అందుకు కారణం.. అవార్డు తీసుకున్న సమయంలో.. కంగనా ఇచ్చిన స్పీచ్. అయితే, ఆ స్పీచ్ కొంతమందిని హర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దేశ శత్రువులపై తాను చేసిన పోరాటాన్ని గురర్తించి భారత ప్రభుత్వం ఈ అవార్డును అందజేసినందుకు గర్వంగా ఉందని కంగనా పేర్కొంది. అంతేకాకుండా, స్పీట్లో కంగనా, జిహాదీలు, ఖలిస్తానీలు అనే పదాలు ఉపయోగించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ సోషల్‌మీడియాలో ఆమెపై కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వ్యక్తికి పద్మశ్రీ అవార్డును ఎలా బహుకరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డుకు కంగనా ప్రసంగంతో విలువ తగ్గించినట్లైందని అన్నారు. అయితే, కంగనా మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. వరుస చిత్రాల్లో షుటింగ్ల్లో ఫుల్ బిజీగా మారిపోయింది.
కంగనా రనౌత్ తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ నిరంజన్’ సినిమాలో నటించింది. కంగనా రనౌత్ ప్రస్తుతం ‘ధాకడ్’, ‘తేజస్’ సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు నిజ జీవిత గాథలపై తెరకెక్కుతున్నాయి.