
KCR – Jagan: కేంద్ర ప్రభుత్వానికి రెండు తెలుగు స్టేట్లలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. తెలుగు ప్రాంతాల ముఖ్యమంత్రులు బీజేపీకి దూరమవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని ఎడాపెడా దులిపేస్తున్నారు. తెలుగు స్టేట్లలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా బీజేపీ నేతలు మాత్రం భయపడటం లేదు. ఇదంతా మామూలే అని లైటుగా తీసుకుంటున్నారు. రెండు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వంపై రోజురోజుకు విమర్శల దాడి పెరుగుతోంది.
పెట్రోధరలు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో స్టేట్లు తగ్గించాలనే డిమాండ్ బీజేపీ నేతలు వినిపిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై అక్కసు పెరుగుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని టార్గెట్ చేసుకుంటూ టీఆర్ఎస్, వైసీపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.

గతంలో కూడా రెండు స్టేట్లలో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు కేంద్రంపై తెలుగు ప్రాంతాలు విరుచుకుపడటం మామూలే. 2018 ఎన్నికలకు ముందు కూడా ఇదే పరిస్థితి ఉందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇస్తున్నారు. ఏడాది ముందు రెండు తెలుగు ప్రాంతాలు ఇలా కేంద్రంపై విమర్శలు చేయడం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం కూడా కేంద్రంపై తెలంగాణ, ఏపీ దుమ్మెత్తిపోస్తున్నట్లు తెలుస్తోంది.
పెట్రోధరల భారం నుంచి ప్రజలను తప్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తగ్గించినా తెలుగు ప్రాంతాలు మాత్రం తగ్గించడం లేదు. దీంతో ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన తరుణంలో కేంద్రంపైనే భారం వేస్తూ మాట్లాడుతున్నాయి. అందుకే బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో బీజేపీని నిందిస్తున్నాయి. మొత్తానికి భవిష్యత్ లో వీటి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
Also Read: కేంద్రంపై తెలుగు రాష్ట్రాల సీఎంల తిరుగుబాటు: ఇక యుద్ధమేనా..?