HomeNewsRRR Troll: 'మావా.. సినిమాలో ఐటెం సాంగ్​ లేదా'.. 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్ రిప్లై చూస్తే షాక్​?

RRR Troll: ‘మావా.. సినిమాలో ఐటెం సాంగ్​ లేదా’.. ‘ఆర్​ఆర్​ఆర్​’ టీమ్ రిప్లై చూస్తే షాక్​?

RRR Troll: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

RRR Troll
RRR Movie

ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జనని పాటను విడుదల చేయగా.. భారీ రెస్పాన్స్​ వచ్చింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఈ పాటపై భావోద్వేగంతో కామెంట్లు చేశారు. విజువల్స్​, ఎమోషన్స్​, సాంగ్​ అన్నీ వేరే లెవెల్​లో ఉన్నాయంటూ పేర్కొన్నారు. అయితే, ఆర్​ఆర్​ఆర్​ టీంకు ఓ నెటిజన్​కు మధ్య ట్విట్టర్​లో జరిగిన ఫన్నీ సంభాషన ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. అందరూ ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తుంటే.. ఓ నెటిజన్​ మాత్రం వెరైటీగా స్పందించాడు.

Also Read: అందుకే రాజమౌళిని తోపు అనేది.. ఈ 3 ఆర్ఆర్ఆర్ సీన్స్ వెనుక ఎంత లోతుందో తెలుసా?

సినిమాలో ఐటెం సాంగ్​ లేదా మావా.. ? అంటూ ఆర్ఆర్​ఆర్​ టీమ్​ను ట్యాగ్​ చేశాడు. అయితే, దీనికి అంతే కూల్​గా సినిమా మేకర్స్ స్పందిస్తూ.. నువ్వు చేస్తావా?. అని బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్​ప్రెషన్​ను జోడించడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ కన్​వర్జేషన్​ నెట్టింట వైరల్​గా మారింది.

డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ‘ఆర్​ఆర్​ఆర్’​కు అక్కడ పెద్ద సమస్యగా మారిన ‘రాధేశ్యామ్’​!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version