Tollywood 100 crore club Movies: మన టాలీవుడ్ లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడమే కష్టం అయిపోతున్న ఈ రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా భారీ లాభాలను రాబట్టిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ చిత్రాల్లో కొన్ని సినిమాలు కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయిన, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా లాభాలను అందుకోవడం విశేషం. కొన్ని సినిమాలు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టై అన్ని ప్రాంతాల్లో లాభాలను సొంతం చేసుకొని ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. అయితే లాభాల్లో బాహుబలి 2 ని మించిన సినిమా మరొకటి లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 508 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి.
ఇప్పటికీ ‘బాహుబలి 2’ నే లాభాల్లో టాప్ 1 స్థానం లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానం ‘పుష్ప 2’ చిత్రం 220 కోట్ల రూపాయిల లాభాలతో కొనసాగుతోంది. అదే విధంగా మూడవ స్థానం లో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం 186 కోట్ల రూపాయలతో కొనసాగుతుండగా, నాల్గవ స్థానం లో #RRR చిత్రం 163 కోట్ల రూపాయిలతో కొనసాగుతుంది. ఇక చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని నెలకొల్పిన ‘హనుమాన్’ చిత్రానికి 128 కోట్ల రూపాయిల లాభాలను రాబట్టి 5 వ స్థానం లో కొనసాగుతుండగా, గత సంక్రాంతికి విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 112 కోట్ల రూపాయిల లాభాలతో ఆరవ స్థానం లో కొనసాగుతోంది. ఇవన్నీ వంద కోట్ల రూపాయలకు పైగా లాభాలను రాబట్టిన సినిమాలు. వీటి తర్వాత ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రం 80 కోట్ల రూపాయిల లాభాలతో 7వ స్థానం లో కొనసాగుతోంది.
ఆ తర్వాత ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘దేవర’ చిత్రం 78 కోట్ల రూపాయలతో 8వ స్థానం లో కొనసాగుతుండగా, అలా వైకుంఠపురం లో చిత్రం 76 కోట్ల రూపాయిల లాభాలతో టాప్ 9 స్థానం లో కొనసాగుతోంది. వీటి తర్వాత మీడియం రేంజ్ హీరోగా పిలవబండే విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం 55 కోట్ల రూపాయలతో 10 వ స్థానం లో కొనసాగుతుండగా, రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 51 కోట్ల రూపాయలతో 11 వ స్థానం లో కొనసాగుతోంది. ఇప్పటికీ థియేటర్స్ లో మంచి లాభాలను రాబడుతున్న ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా టాప్ 10 లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం;లు కనిపిస్తున్నాయి.