
Dasara Collections: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని బంపర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ప్రీ రిలీజ్ ముందు నుండే ఈ సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉండేవి.అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, మరియు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
వీటికి తోడు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ రావడం అగ్ని కి ఆజ్యం తోడు అయ్యినట్టు అయ్యింది.మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీ షోస్ మరియు ఫస్ట్ షోస్ కలెక్షన్స్ ఒక రేంజ్ లో వచ్చాయి. మొత్తం మీద ఫైనల్ వరల్డ్ వైడ్ షేర్ మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పడం మాత్రమే కాదు, నాని ఇక నుండి స్టార్ హీరో అని చెప్పే రేంజ్ లో వసూలు వచ్చాయి.
అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.కేవలం స్టార్ హీరోలకు తప్ప ఇది వరకు మీడియం రేంజ్ హీరోలకు ఇంత వసూళ్లు రావడం ఎప్పుడూ చూడలేదు. నాని కి మొదటి నుండి ఫ్యామిలీ ఆడియన్స్ మరియు న్యూట్రల్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. సరైన సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు.

ఆ సరైన సినిమా దసరా నే,కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అది కూడా స్టార్ డైరెక్టర్ సపోర్ట్ లేకుండా ఒక నూతన దర్శకుడితో ఇలాంటి వసూళ్లు రాబడితే ఎవరు మాత్రం నాని ని మీడియం రేంజ్ హీరో అంటారు. ఇక నుండి ఆయన ఇదే ఫ్లో ని కొనసాగిస్తూ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ పోతే టాప్ 5 హీరోలలో ఒకరిగా నిలుస్తాడని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.