Homeక్రీడలుIndia Vs Pakistan: ఇండియాకు రానంటున్న పాక్‌.. వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు కండీషన్‌!

India Vs Pakistan: ఇండియాకు రానంటున్న పాక్‌.. వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు కండీషన్‌!

India Vs Pakistan
India Vs Pakistan

India Vs Pakistan: క్రీడల్లో దాయాదుల పోరును చూడాలని ఇటు భారత్, అటు పాకిస్థాన్‌ క్రీడాభిమానులు ఆసక్తి చూపుతుంటారు. రెండు జట్ల మధ్య ఏదైనా మ్యాచ్‌ జరుగుతుందంటే అభిమానులకు పండగే. ఇక క్రికెట్‌ అయితే ఆ కిక్కే వేరు. అయితే.. ఈ ఏడాది చివరన ప్రారంభమయాఏ్య వన్డే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ – పాకిస్థాన్‌ తలపడే విషయంలో మీమాంస కొనసాగుతోంది. పీసీబీ నిర్ణయం దాయాదుల పోరుకు అడ్డకింగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇండియాకు రానంటున్న పాక్‌..
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఈసారి వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ – పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను చూసే అవకాశం క్రికెట్‌ అభిమానులకు లేనట్టే కనిపిస్తున్నాయి. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్, పాకిస్థాన్‌లో ఆసియా కప్‌ టోర్నమెంట్‌లు జరిగాల్సి ఉంది. అయితే, పాక్‌లో ఆసియా కప్‌ను నిర్వహిస్తే తమ జట్టు రాదని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తటస్థ వేదికలపైనే ఆడతామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. దీంతో పాక్‌ కూడా తాము వన్డే ప్రపంచకప్‌లో ఆడేదిలేదని అప్పటి నుంచే చెబుతూ వస్తోంది. తాజాగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పాక్‌ తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తెలిసింది. కాకపోతే ప్రపంచ కప్‌లో ఆడేందుకు కొత్త షరతులను విధించడం గమనార్హం.

తటస్థ వేదిక అయితే సై..
ఆసియా కప్‌లో భారత్‌ తటస్థ వేదికలపైనే ఆడేందుకు మొగ్గు చూపినట్లే.. పాకిస్థాన్‌ కూడా వన్డే ప్రపంచకప్‌లో తాము ఆడాల్సిన మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌ లేదా శ్రీలంక దేశాల్లోని మైదానాల్లో నిర్వహించాలని కండీషన్‌ విధించినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ – నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్‌ జరగనుంది. అయితే, ఇప్పటి వరకు ఐసీసీ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఈ క్రమంలో కొత్త షరతులతో పాక్‌ క్రికెట్‌ బోర్డు ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రతిపాదనకు ఐసీసీ, బీసీసీఐ మాత్రం దీనికి ఒప్పుకోవడం కష్టమేనని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

India Vs Pakistan
India Vs Pakistan

ఆసియా కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌పై తుది నిర్ణయం వెలువడితే మాత్రం ప్రపంచకప్‌ సమస్యకూ తెరపడే అవకాశం కనిపిస్తోంది.
పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌కు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భద్రతరీత్యా దాయాది దేశానికి వెళ్లేందుకు మాత్రం టీమిండియాకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యం. మరి దాయాదుల పోరు జరుగుతుందో లేదో వేచిచూడాలి.

RELATED ARTICLES

Most Popular