అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగ…ఒక సినిమాని బోల్డ్ కంటెంట్ తో చేసి కూడా సూపర్ సక్సెస్ ని సాధించవచ్చు అని నిరూపించిన దర్శకుడు సందీప్…ఇక అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆ మూవీ ని బాలీవుడ్లో రీమేక్ చేయమని చాలామంది అడిగారట. దాంతో కాదనలేక బాలీవుడ్లో రన్వీర్ సింగ్ తో ఈ సినిమాని రీమేక్ చేద్దామని అనుకున్నాడట.
కానీ కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ రన్వీర్ సింగ్ కి పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదట. దాంతో అతను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత రణ్బీర్ కపూర్ ని కూడా అడిగారట. కానీ అతను కూడా ఆ కథను రిజెక్ట్ చేయడంతో ప్రొడ్యూసర్లు షాహిద్ కపూర్ దగ్గరికి వెళ్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్లి కథను ఒప్పించి మరీ అతనితో సినిమా చేశారు.
ఇక ఈ సినిమా చేసే సందర్భంలో సందీప్ తో చాలామంది షాహిద్ కపూరు కి పెద్దగా మార్కెట్ లేదని మహా అయితే 50, 60 కోట్ల మార్కెట్ మాత్రమే ఉందని తెలుగు హీరోని పెట్టుకొని చేసినా కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఈజీగా వస్తాయని చాలామంది చెప్పారట. కానీ సందీప్ మాత్రం షాహిద్ కపూర్ మీద నమ్మకంతో ఆ సినిమాని చేశాడు. ఇక కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్ లో 300 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
షాహిద్ కపూర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా తర్వాత రన్బీర్ కపూర్ తో అనిమల్ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుంది. సగటు ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…