Rajamouli Upcoming Film update: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తన కెరియర్ మొదలైనప్పటికి ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. రాజమౌళి నుంచి సినిమా వస్తే చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ప్రస్తుతం మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమా అయిపోయిన తర్వాత మరో సినిమాను వెంటనే చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక మరోసారి తను మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్, సూర్య లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పెట్టి ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన మరోసారి మల్టీస్టారర్ సినిమాల వైపే తన అడుగులు వేస్తున్నాడు. మరి ఈ సినిమా కథ ఫిక్షనల్ స్టోరీ తో తెరకెక్కబోతుందట. పురాతన కథల్లోని ఇన్స్పైర్ రాసుకున్న కథగా తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఈ సినిమా స్టోరీ ని రెడీ చేశారట.
ఇక ఏది ఏమైనా కూడా వారణాసి రిజల్ట్ ఎలా ఉంటుంది. పాన్ వరల్డ్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది ఇప్పుడు రాజమౌళి ముందు ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ గా తెలుస్తోంది. ఇక ఈ సినిమా సాధించే సక్సెస్ ను బట్టి తన తదుపరి సినిమాలు ఏ రేంజ్ లో ఉండబోతాయనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు… ఇక మొత్తానికైతే తమిళ్ స్టార్ హీరో సూర్య రాజమౌళి డైరెక్షన్లో నటించాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు.
కానీ అతనికి రాజమౌళి ఇప్పటివరకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా అల్లు అర్జున్ తో రాజమౌళి ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇక రాజమౌళి మాత్రం సూర్య – అల్లు అర్జున్ ని కలిపి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకులందరి చేత సుభాష్ అనిపించుకునేలా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…