MS Dhoni Birthday: టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించిన ఘనత మహేంద్ర సింగ్ ధోనికే దక్కింది. టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ధోనికి రికార్డు ఉంది. టీమిండియా కు గుడ్ బై చెప్పినప్పటికీ.. ధోని ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. చెన్నై జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు. 2023 సీజన్ లో చెన్నై జట్టు ట్రోఫీ దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలి ఐపీఎల్ లో చెన్నై జట్టు కెప్టెన్ గా వైదొలిగాడు. తన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం కల్పించాడు.
2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన తొలి t20 వరల్డ్ కప్ లో భారత జట్టును ధోని విజేతగా నిలిపాడు.. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో తన వ్యూహ చతురతతో ట్రోఫీని దక్కించుకునేలా చేశాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ లోనూ భారత జట్టును ధోని విజేతగా నిలిపాడు. శ్రీలంక జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. విన్నింగ్ షాట్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. ఇక 2013 లో ఛాంపియన్ ట్రోఫీ ని టీమిండియా దక్కించుకోవడంలో ధోని ముఖ్య పాత్ర పోషించాడు. ఐసీసీ నిర్వహించిన అన్ని మెగా టోర్నీలలో టీమిండియాను ధోని విజేతగా నిలిపాడు. 2007లో ధోని ఆధ్వర్యంలో t20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. 17 ఏళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది.
జూలై ఏడు నాటికి ధోని 42వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులు అతని జన్మదినానికి ముందు ఒక రోజే అదిరిపోయే కానుక అందించారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కన 100 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే పక్కన బ్లూ రంగు జెర్సీ లో ధోని చిత్రాన్ని రూపొందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక గత ఏడాది 77 అడుగుల ఎత్తుతో ధోని కటౌట్ రూపొందించారు.. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో అభిమానులు దీనిని సర్కులేట్ చేయగా.. ధోని సంబరపడ్డాడు.
This is massive.., A 100 feet cut out has been made by Telungu fans ahead of Ms Dhoni’s Birthday Tomorrow (7) pic.twitter.com/PI8bRiqX5N
— Nibraz Ramzan (@nibraz88cricket) July 6, 2024