https://oktelugu.com/

Vastu Tips: ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే మనీ ప్లాంట్ ఈ దిశలో ఉండాల్సిందే!

Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో వాస్తు శాస్త్రాలు నమ్ముతూ ఉంటాము. ఈ క్రమంలోనే ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ మన ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువుని కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు.ఈ క్రమంలోనే చాలామంది ఇంటిలో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థికంగా ఎంతో మంచి కలుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది? మనీప్లాంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 3, 2021 / 10:35 AM IST
    Follow us on

    Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో వాస్తు శాస్త్రాలు నమ్ముతూ ఉంటాము. ఈ క్రమంలోనే ఎన్నో వాస్తు పరిహారాలను పాటిస్తూ మన ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువుని కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు.ఈ క్రమంలోనే చాలామంది ఇంటిలో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థికంగా ఎంతో మంచి కలుగుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో మనీ ప్లాంట్ ఏ దిశలో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది? మనీప్లాంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

    Vastu Tips

    మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే మనీ ప్లాంట్ మన ఇంటికి ఎప్పుడు కూడా కుడివైపు ఉండాలి. ఈ క్రమంలోనే మనీ ప్లాంట్ కుడివైపుగా ఆగ్నేయ మూలలో ఉంచడం ఎంతో అవసరం. ఇలా ఆగ్నేయమూలలో ఉంచడం వల్ల మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కేవలం మనీ ప్లాంట్ ను ఈ దిశలో ఉంచడమే కాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.

    Also Read: ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా.. ఆ సమస్యలు వచ్చే అవకాశం?

    మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా బాత్ రూం ఉండే వైపు పెట్టకూడదు. అలాగే ఒక గాజు సీసాలో మనీప్లాంట్ పెట్టడం ఎంతో మంచిది. అలాగే మనీ ప్లాంట్ ఎప్పుడు వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనీ ప్లాంట్ వాడిపోతే ఇంట్లో ఎన్నో ఇబ్బందులు, గొడవలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే మనీ ప్లాంట్ ఆకులు హృదయాకారంలో ఉన్నటువంటి చెట్టును పెంచడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

    Also Read: సీనియర్ సిటిజన్లకు సూపర్ ఆఫర్.. రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.14 లక్షలు!