https://oktelugu.com/

Akhanda: అఖండ సినిమాకు బ్రేకులేసి షాక్​ ఇచ్చిన అధికారులు.. బెనిఫిట్​ షో వేసినందుకు చర్యలు

Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుని.. ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. థియేటర్లలో బాలయ్య స్టైల్​ చూసి అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఎక్కడ అరవాలో  కూడా తెలియనంతగా.. ఎలివేషన్స్ అదిరిపోయాయని అంటున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్​లో హ్యాట్రిక్​ సినిమా వచ్చినట్లైంది. అయితే, ఈ సినిమాను పలు చోట్ల నిలిపేయాల్సి వచ్చింది. ఏపీలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బెనిఫిట్​ షోలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 10:39 AM IST
    Follow us on

    Akhanda: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ. డిసెంబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుని.. ప్రేక్షకుల మన్ననలను అందుకుంటోంది. థియేటర్లలో బాలయ్య స్టైల్​ చూసి అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఎక్కడ అరవాలో  కూడా తెలియనంతగా.. ఎలివేషన్స్ అదిరిపోయాయని అంటున్నారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్​లో హ్యాట్రిక్​ సినిమా వచ్చినట్లైంది.

    అయితే, ఈ సినిమాను పలు చోట్ల నిలిపేయాల్సి వచ్చింది. ఏపీలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో బెనిఫిట్​ షోలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని థియేటర్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలు పాటించని థియేటర్లపై రెవెన్యూశాఖ చర్యలు తీసుకుంది. తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు వేసిన రామకృష్ణ సినిమా థియేటర్​ను రెవెన్యూ అధికారులు సీజ్​ చేశారు. రెండు స్క్రీన్స్​లో రూల్స్ బ్రేక్​ చేసిన ఓ స్క్రీన్​పై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో స్క్రీన్​ యథాతథంగా సాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా, రోజుకు నాలుకు షోలకు మాత్రమే ప్రస్తుతం అనుమతి ఉందని వెల్లడించారు.

    కాగా, ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటించింది. థమన్​ స్వరాలు అందించారు. జగపతి బాబు, శ్రీకాంత్​ కీలకపాత్రల్లో పోషించారు. మరోవైపు ఈ సినిమా తర్వాత అనిల్​ రావిపూడితో కలిసి ఓ సినిమా తీయనున్నారు బాలయ్య. ఇందులో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.