Love Tips: విడిపోయిన ప్రియురాలితో తిరిగి కలవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

Love Tips: ఇద్దరు మనుషుల మధ్య బంధం పదికాలాల పాటు నిలబడాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో సున్నితంగా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుగా ఆవేశంగా మాట్లాడిన బంధాలను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇద్దరు ప్రేమికుల విషయంలో ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం. పొరపాటున నోరుజారి అనరాని మాటలు అంటే ఆ బంధం అక్కడితో ముక్కలవుతుంది. ఇలా ఎన్నో జంటలు విడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి విడిపోయిన జంట కలవాలన్న మీ ప్రియురాలినీ తిరిగి […]

Written By: Kusuma Aggunna, Updated On : December 3, 2021 1:21 pm
Follow us on

Love Tips: ఇద్దరు మనుషుల మధ్య బంధం పదికాలాల పాటు నిలబడాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో సున్నితంగా చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పుగా ఆవేశంగా మాట్లాడిన బంధాలను కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇద్దరు ప్రేమికుల విషయంలో ఈ జాగ్రత్తలు ఎంతో అవసరం. పొరపాటున నోరుజారి అనరాని మాటలు అంటే ఆ బంధం అక్కడితో ముక్కలవుతుంది. ఇలా ఎన్నో జంటలు విడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. మరి విడిపోయిన జంట కలవాలన్న మీ ప్రియురాలినీ తిరిగి కలుసుకోవాలన్న ఈ టిప్స్ పాటిస్తే.. తిరిగి మీ బంధం బలపడుతుంది.

Love Tips

* ఇద్దరు ప్రేమికులు విడిపోతే ప్రియుడు ప్రియురాలి దగ్గరికి ఎరుపు రంగు గులాబీలతో వెళ్లాలి. ఇలా ఎరుపు రంగు గులాబీ బొకే తీసుకెళ్లి తనకు ఇచ్చి తన తప్పును క్షమించమని కోరితే తప్పకుండా ఆమె తిరిగి మిమ్మల్ని అంగీకరిస్తుంది.

* మీ ప్రియురాలు మీపై కోపంగా ఉండి మాట్లాడకపోతే తనకు ఒక చాక్లెట్ ఇచ్చి మీ ప్రేమను తెలియజేయండి. తప్పకుండా మీ మధ్య జరిగిన గొడవ పక్కనపెట్టి తను తిరిగి మీ ప్రేమను అంగీకరిస్తుంది.

Also Read: ఒక్క ఐడియాతో నెలకు కోటి సంపాదిస్తున్న యువతి..!

* చాలామంది వారి ప్రియురాలు ను ఇంప్రెస్ చేయడానికి స్వయంగా తన కోసం ఒక పాటను పాడుతుంటారు. ఇలా ఇలా పాట ద్వారా తనని ఇంప్రెస్ చేస్తే తనకు మీ గొంతు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా చేయటం వల్ల మీరు లేకపోతే వారు ఉండలేమన్న భావన వారిలో కలుగుతుంది.

* ఇక చాలామంది తన ప్రేయసి పట్ల తమలో ఉన్న భావాలను వ్యక్తపరిచే ద్వారా మీలో ఉన్న భావాలను అందులో పొందుపరిచి మీ ప్రియురాలికి పంపించండి
మీరు రాసిన ప్రతి పదంలో నమ్మకం నిజాయితీ ఉంటే తప్పకుండా తిరిగి తను మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఈ విధంగా విడిపోయిన ప్రియురాలితో తిరిగి మన బంధం కొనసాగించాలంటే పై తెలిపిన టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.

Also Read: పొరపాటున కూడా ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోకండి.. ఏవంటే?