Marakkar: ప్రముఖ మలయాళ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మరక్కార్: అరేబియా సముద్ర సింహం. 15 వ శతాబ్దానికి చెందిన నేవర్ చీఫ్ మహమ్మద్ అలీ మరక్కర్ అలియాస్ కుంజాలి మరక్కర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. డిసెంబరు 3న ఈసినిమా ప్రేక్షకులను పలకరించేందుసు సిద్ధమైంది.సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో ఈ సినిమాను విడదల చేస్తోంది. మోహన్‌లాల్- ప్రియదర్శన్ కలియకలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఎన్నో జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇటీవలే తెలుగు మలయాళంతో పాటు.. పలు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
డిసెంబరు 2న మలయాళంతో పాటు వివిధ భాషల్లో విడుదల కాగా..తెలుగులో మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, సిద్దిక్, కీర్తి సురేశ్, మంజు వారియర్, కళ్యాణి ప్రియదర్శన్ తదితర భారీ తారాగణం కీలక పాత్రల్లో పోషించారు. ఈ సినిమాను మోహన్‌లాల్ ప్రాణ స్నేహితుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంంతో విడుదలైన 15రోజుల్లోనే ఓటీటీ వేదికగా విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్ .
అమెజాన్ ప్రైమ్‌లో డిసెంబరు 17న మలయాళం, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమా విడుదల కాకముందే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ తనయుడు కూడా నటించారు.